Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, బుమ్రా సిక్స్‌ ప్యాక్‌: యువీ ఫిదా.. ఓహ్ వాట్ ఏ ఫిట్‌నెస్ ఐడల్‌

India Vs West Indies 2019 : Virat Kohli & Jasprit Bumrah Six Pack Pic Goes Viral || Oneindia Telugu
Yuvraj Singh trolls Jasprit Bumrah for showing off his Six-Pack abs with Virat Kohli

ఢిల్లీ: టీమిండియా ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉంది. వెస్టిండీస్‌ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లను గెలుచుకుని ప్రస్తుతం టెస్ట్ సిరీస్‌కు సిద్దమయింది. టీ20, వన్డే సిరీస్‌లతో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లకు.. వెస్టిండీస్‌-ఏతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అనంతరం రెండు రోజుల విరామం లభించడంతో తెగ ఎంజాయ్ చేశారు.

బాయ్స్‌తో అద్భుతమైన రోజు:

టీమిండియా క్రికెటర్లు అందరూ ఆంటిగ్వా బీచ్‌ పార్టీలో ఎంజాయ్ చేశారు. అందరూ కలిసి అర్ధ నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోని విరాట్ కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. 'బాయ్స్‌తో బీచ్ వద్ద అద్భుతమైన రోజు' అంటూ కోహ్లీ కామెంట్ పెట్టాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, అంజిక్య రహానే, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్‌లు బీచ్ పార్టీలో పాల్గొన్నారు.

ఓహ్‌.. ఫిట్‌నెస్‌ ఐడల్‌:

ఓహ్‌.. ఫిట్‌నెస్‌ ఐడల్‌:

బీచ్‌లో అందరూ ఫోటోలకు ఫోజులివ్వగా.. అందులో స్పెషల్ అట్రాక్షన్‌గా కోహ్లీ, బుమ్రాల సిక్స్‌ప్యాక్ నిలిచింది. కోహ్లీతో కలిసి సిక్స్‌ ప్యాక్‌ ఫోజిచ్చిన ఫోటోను బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్టుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ కూడా వారి సిక్స్‌ ప్యాక్‌కు ఫిదా అయ్యాడు. అంతేకాదు.. 'ఓహ్‌.. ఫిట్‌నెస్‌ ఐడల్‌' అంటూ రాసుకొచ్చాడు. గత కొన్నేళ్లుగా తన కోహ్లీ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ సహచర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం జట్టులోని ప్రతి ఒక్కరు కోహ్లీనే ఫాలో అవుతున్నారు.

బీచ్‌లో విరుష్క జంట:

బీచ్‌లో విరుష్క జంట:

అంతకుముందు వన్డే, టెస్ట్ సిరీస్ మధ్య ఖాళీ సమయంలో కోహ్లీ తన భార్యతో కలిసి ఎంజాయ్ చేసాడు. ఖాళీ సమయం దొరకడంతో ఇద్దరూ బీచ్‌లో తిరుగుతూ సరదా సమయం గడిపారు. ఈ సమయంలో తీసిన ఫొటోను కోహ్లీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ ఫొటోలో విరుష్క జంట బీచ్ ఒడ్డున కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. కోహ్లీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

 టీమిండియా ఫేవరెట్‌:

టీమిండియా ఫేవరెట్‌:

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్‌ సమరానికి సిద్దమయింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం సర్ వివ్ రిచర్డ్స్ మైదానంలో భారత్-విండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. అయితే కోహ్లీ సేనకు తుది జట్టు కూర్పే పెద్ద సవాల్‌గా మారింది. మిడిలార్డర్‌లో రోహిత్ శర్మ, అజింక్య రహానేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వార్మప్‌ మ్యాచ్‌లో ఇద్దరు అదరగొట్టాడు. దీంతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.

Story first published: Thursday, August 22, 2019, 12:37 [IST]
Other articles published on Aug 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+