Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తుది చర్చలు.. టీ10 లీగ్‌లో యువరాజ్‌!!?

Yuvraj Singh To Join Abu Dhabi T10 League Soon ! || Oneindia Telugu
Yuvraj Singh To Join Abu Dhabi T10 league, Says Chairman Shaji Ul Mulk

ఢిల్లీ: అబుదాబి వేదికగా జరగనున్న టీ10 లీగ్‌లో భారత మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ ఆడే అవకాశం ఉంది. నవంబర్‌ 15 నుంచి 24 వరకు జరిగే మూడో సీజన్‌లో యువరాజ్‌ సింగ్‌ పాల్గొనే అవకాశముందని టోర్నమెంట్‌ ఛైర్మన్‌ షా ఉల్‌ ముల్క్‌ ఓ ప్రకటనలో తెలిపాడు. టీ10 లీగ్‌ మూడో సీజన్‌లో భాగంగా బుధవారం నిర్వహించిన ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌లో భారత్‌ నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు.

యువీతో తుది చర్చలు:

యువీతో తుది చర్చలు:

తాజాగా ఉల్‌ ముల్క్‌ మాట్లాడుతూ... 'బీసీసీఐ నియమాలను గౌరవించే భారత్‌ నుంచి రిటైర్‌ అయిన ఆటగాళ్లని తీసుకుంటున్నాం. ప్రస్తుతం యువీతో తుది చర్చలు జరుగుతున్నాయి. టోర్నీలో యువరాజ్‌ను ఆడిస్తామనే నమ్మకం మాకు ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం. యువీ ఆడితే సంతోషం. గ్లోబల్‌ కెనడా టీ20 లీగ్‌లోనూ బాగా ఆడాడు' అని అన్నాడు. ఇంగ్లండ్ ప్రపంచకప్ విజేత కోచ్ ట్రెవర్ బేలిస్‌ అబుదాబి ఫ్రాంచైజీ కోచ్‌గా నియమితులయ్యారు. యువీ అబుదాబి జట్టుకు ఆడనున్నాడని సమాచారం.

గ్లోబల్‌ టీ20 లీగ్‌లో యువీ మెరుపులు:

గ్లోబల్‌ టీ20 లీగ్‌లో యువీ మెరుపులు:

యువరాజ్‌ సింగ్‌ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌-12లో ముంబై ఇండియన్స్‌కు ఆఖరి సారిగా ప్రాతినిధ్యం వహించిన యువరాజ్‌.. జాతీయ జట్టు తరఫున రెండేళ్ల క్రితం 2017 జూన్‌లో చివరి వన్డే ఆడాడు. వీడ్కోలు అనంతరం యువీ కెనడాలో జరిగిన గ్లోబల్‌ టీ20 లీగ్‌లో పాల్గొన్నాడు. ఆ లీగ్‌లో యువీ తన పాత రోజులను గుర్తుకుతెచ్చాడు. మెరుపు అర్ధ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

మూడో సీజన్‌లో స్టార్ ఆటగాళ్లు:

మూడో సీజన్‌లో స్టార్ ఆటగాళ్లు:

యువీ అబుదాబి టీ10 లీగ్‌ ఆడితే అభిమానులు మరోసారి సిక్సర్ల వర్షం చూస్తారు. ఈ టోర్నీలో శ్రీలంక ఆటగాళ్లు లసిత్‌ మలింగా, థిసారా పెరీరా, నిరోషన్‌ డిక్‌వెల్లా.. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీ.. పాక్‌ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిదీ, హిట్టర్ కీరన్ పోలార్డ్ కూడా పలు జట్లకు ఆడుతున్నారు. మూడో సీజన్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. అఫ్రిది కలందర్స్ జట్టు జట్టు తరుపున బరిలోకి దిగనున్నాడు.

Story first published: Friday, October 18, 2019, 13:41 [IST]
Other articles published on Oct 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+