యువీ-హజెల్ పెళ్లికి ముహూర్తం ఖరారు: ఇది పైనల్!
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లి తేదీ ఖరారైంది. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి హజెల్ కీచ్‌ను యువీ నవంబరు 30న వివాహమాడనున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు.
'డిసెంబరు 5 నుంచి 7 మధ్య రిసెప్షన్ ఉంటుంది. పెళ్లి నవంబరు 30న జరుగుతుంది' అని వారు చెప్పారు. తన సొంత పట్టణంలోనే యువీ వివాహం జరుగనున్నట్లు తెలిసింది. పెళ్లికి మాత్రం సన్నిహితులను మాత్రమే పిలిచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

కాగా, గత మూడేళ్లుగా ప్రేమాయణంగా కొనసాగిస్తున్న యువీ-కీచ్‌ల నిశ్చితార్థం గత నవంబరులో బాలిలో జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడన్నదానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. కాగా, ఇప్పుడు వీరి ప్రకటనతో వాటన్నింటికీ తెరపడినట్లయింది.
'గత మూడేళ్లుగా యువరాజ్‌కు హజెల్ తెలుసు. కానీ నిశ్చితార్థానికి మూడు నెలల ముందు నుంచి మాత్రమే వాళ్లు డేటింగ్ చేస్తున్నారు. 2016 శీతాకాలంలో పెళ్లి చేసుకోనున్నట్లు వాళ్లు నిరుడు ప్రకటించారు' అని యువీ సన్నిహితులు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications