యువరాజ్ సింగ్: భారత్‌కు మూడు వరల్డ్‌కప్‌లు అందించిన లెజెండరీ క్రికెటర్

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి తన 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. భారత తరుపున యువీ తన చివరి మ్యాచ్‌ని జూన్ 30, 2017న ఆడాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ "25 ఏళ్ల తర్వాత వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం. దాదాపు 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సహచరులకు కృతజ్ఞతలు" అని యువరాజ్ అన్నాడు.
"క్రికెట్ కోసం తన రక్తం, స్వేదం ధారపోశాను. క్యాన్సర్ బాధితులకు సాయం అందించడమే నా తదుపరి లక్ష్యం. జీవితంలో ఏ విధంగా పోరాడాలో క్రికెటే నేర్పింది. జీవితంలో నేను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. క్రికెట్ ఆడటం.. తనకు పోరాడటం, పడటం.. లేవడం ముందుకు సాగడం నేర్పింది" అని యువీ భావోద్వేగానికి గురయ్యాడు.
2012లో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన యువరాజ్ 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు. యువీ రిటైర్మెంట్ నేపథ్యంలో అతడి కెరీర్‌లో నమోదైన గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం...

అత్యధిక సార్లు ఐసీసీ ఫైనల్స్ ఆడిన ఆటగాడు
యువరాజ్ సింగ్ అత్యధిక ఐసీసీ ఫైనల్స్(6) ఆడిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ, 2003 వరల్డ్‌కప్, 2007 వరల్డ్ టీ20, 2011 వరల్డ్‌కప్, 2014 వరల్డ్ టీ20, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలలో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు.

టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ
2007 వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ యువరాజ్ సింగ్ 6 సిక్సులు బాదాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. యువీ ఈ రికార్డు నెలకొల్పిన తొమ్మిదేళ్లకు బీబీఎల్‌లో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఈ రికార్డుని సమం చేశాడు.

ఒకే ఓవర్‌లో 6 సిక్సులు
2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి నయా ట్రెండ్ సృష్టించాడు. ఈ ఓవర్ ప్రతి భారత క్రికెట్ అభిమానికి ఇప్పటికీ గుర్తే. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సుర్లు బాదిన సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, రవిశాస్త్రి, గిబ్స్ సరసన నిలిచాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లను ఆరుగురు బ్యాట్స్‌మన్ బాదారు.

యువీ ఖాతాలో రెండు విభిన్నమైన రికార్డులు
ఐసీసీ వరల్డ్‌కప్(2011), టీ20 వరల్డ్ కప్(2007), అండర్-19 వరల్డ్‌కప్(2000) గెలిచిన ఏకైక క్రికెటర్. వన్డే కెరీర్‌లో 304 మ్యాచ్‌ల్లో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ 8 ఆఫ్ సెంచరీలతో 1177 పరుగులు నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications