మిడ్ వికెట్ మీదుగా యువరాజ్ భారీ సిక్స్: మ్యాచ్‌కే హైలెట్ (వీడియో)

హైదరాబాద్: కెనడా వేదికగా జరుగుతున్న గ్లోబల్ టీ20 టోర్నీలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సత్తా చాటాడు. ఈ లీగ్‌లో టోరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న యువరాజ్ సింగ్ శనివారం ఎడ్మాంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
అయితే, యువీ బాదిన మూడు సిక్సుల్లో ఒక సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎడ్మాంటన్ రాయల్స్ నిర్ణీత 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. బెన్ కటింగ్ 43 పరుగులతో అజేయంగా నిలవగా.. షాదబ్ ఖాన్ 36 పరుగులతో ఫరవాలేదనిపించాడు.

192 పరుగుల లక్ష్య చేధనలో
అనంతరం ఎడ్మాంటన్ రాయల్స్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య చేధనలో నాలుగో స్థానంలో వచ్చిన యువరాజ్ సింగ్ తనదైన శైలిలో విజృంభించాడు. ఎడ్మాంటన్ తరఫున ఆడుతున్న పాక్ లెగ్ స్సిన్నర్ షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బాదిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ మ్యాచ్‌లో టోరంటో నేషనల్స్ జట్టు రెండు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టొరెంటో నేషనల్స్ జట్టుని కెప్టెన్ యువరాజ్ సింగ్-హెన్రిచ్ క్లాసెన్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించారు.

85 పరుగుల వద్ద యువీ ఔట్
అనంతరం జట్టు స్కోరు 85 పరుగుల వద్ద యువీ ఔట్ కాగా, మరో మూడు పరుగుల వ్యవధిలో కీరన్ పొలార్డ్(2) పెవిలియన్ చేరాడు. దీంతో 14 ఓవర్లు ముగిసే సరికి టొరెంటో నేషనల్స్ 125 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మన్‌ప్రీత్ గోనీ 12 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు.

రెండు వికెట్ల తేడాతో టోరంటో నేషనల్స్ విజయం
చివర్లో మాంట్‌ఫోర్ట్-సల్మాన్ నజార్‌లు దూకుడుగా ఆడటంతో యువరాజ్ సింగ్ నాయకత్వంలోని టోరంటో నేషనల్స్ 17.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ఎడ్మాంటన్ బౌలర్లలో షాదబ్ ఖాన్ 42 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications