Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రితో పోలికపై యువరాజ్ సింగ్ సంచలన ప్రకటన!

Yuvraj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. తన తండ్రి యోగరాజ్ సింగ్ గురించి సంచలన ప్రకటన చేశారు. తన తండితో పోలిక గురించి అడిగినప్పుడు.. తాను ఆయనలాంటి వ్యక్తిని ఖచ్చితంగా కానని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన ద్వారా కోచింగ్, మెంటరింగ్ విషయంలో తన వైఖరి, తన తండ్రి పద్ధతికి ఎంత భిన్నంగా ఉందో యువరాజ్ వివరించారు.

భిన్నంగా యువరాజ్ సింగ్ కోచింగ్ స్టైల్
యువరాజ్ సింగ్ కోచింగ్ ఇచ్చే విధానం లేదా యువ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేసే పద్ధతి తన తండ్రి యోగ్రాజ్ సింగ్ అనుసరించే పద్ధతికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. యోగరాజ్ సింగ్ కఠినమైన క్రమశిక్షణ, దృఢమైన, కఠోరమైన వైఖరిని నమ్ముతారు. యువరాజ్ చిన్నతనంలో క్రికెట్‌పై దృష్టి పెట్టేలా చేయడానికి, ఆయన స్కేటింగ్ షూస్‌ను విసిరేసిన సంఘటనలు వంటివి ఆయన కఠినత్వానికి నిదర్శనంగా ఇప్పటికీ చెప్పుకుంటారు. దీనికి పూర్తి విరుద్దంగా యువరాజ్ సింగ్ శైలి సున్నితంగా ఉంటుంది. ఆయన యువ క్రీడాకారుల అవసరాలను అర్థం చేసుకోవడంపై , వారి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవడంపై దృష్టి పెడతారు.

Yuvraj Singh Stunning Revelation About His Father Coaching Style and His Own Unique Mentorship

యువరాజ్ ఏమన్నారంటే..?
ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ తన కోచింగ్, మెంటరింగ్ విధానాన్ని వివరంగా వివరించారు. యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, "నేను ఖచ్చితంగా యోగరాజ్ సింగ్ లాంటివాడిని కాదు. నేను చాలా విభిన్నమైన వ్యక్తిని, నా వ్యక్తిత్వం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే నా కోచింగ్ పద్ధతి కూడా చాలా భిన్నంగా ఉంటుంది." అని అన్నారు."ఎవరికైనా కోచింగ్ ఇస్తున్నప్పుడు లేదా మెంటరింగ్ చేస్తున్నప్పుడు కేవలం ఏం చేయాలో చెప్పే బదులు మీరు వారి స్థానంలో ఉండి ఆలోచించాలి. వారు ఎలా ఫీల్ అవుతున్నారో వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని నేను నమ్ముతాను. ఇది ఒక ఫుష్ అండ్ పుల్ లాగా ఉండాలి. అంటే మీరు కొంత తీసుకుంటారు, కొంత ఇస్తారు. కాబట్టి 19 ఏళ్ల కుర్రాడి మనస్సులో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం." అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చారు.

యువ క్రీడాకారులతో యువీ అనుబంధం
యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసి వారి కెరీర్‌ను తీర్చిదిద్దడంలో సహాయపడ్డారు. ఈ అనుభవం నేపథ్యంలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "నేను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఎదుర్కొంటున్న సవాళ్లను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. అందుకే ఈ రోజు 19 లేదా 20 ఏళ్ల యువ ఆటగాడిని చూసినప్పుడు.. వారు మానసికంగా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు" అని యువరాజ్ సింగ్ అన్నారు.

యువీ అభిప్రాయం ప్రకారం.. యువ ఆటగాళ్లతో ఓ ప్రత్యేకమైన, బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా అవసరం. ఆటగాడి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, సరైన దిశలో వారికి మార్గనిర్దేశం చేయడమే ఒక మెంటర్ కీలకమైన పని అని యువరాజ్ సింగ్ నమ్ముతారు. మైదానంతో పాటు బయట కూడా యువకులు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలను ఆయన అర్థం చేసుకుంటారు. అందుకే ఆయన కోచింగ్ ప్రక్రియను, ఆటగాడు, మెంటర్ ఇద్దరూ ఒకరి నుండి మరొకరు నేర్చుకునే ద్వైపాక్షిక ప్రక్రియగా అభివర్ణించారు. యువరాజ్ సింగ్ తన అనుభవం, దయతో కూడిన మానవతా విధానంతో యువ క్రికెటర్లకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ తనదైన ప్రత్యేకమైన మెంటరింగ్ పద్ధతిని కొనసాగిస్తున్నారు.

Story first published: Friday, November 7, 2025, 10:14 [IST]
Other articles published on Nov 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+