భారత జట్టులోకి యువీ: కోహ్లీకి థాంక్స్ చెప్పిన అభిమానులు
హైదరాబాద్: ఇంగ్లాండ్ సిరిస్‌కు బీసీసీఐ భారత జట్టును శుక్రవారం ప్రకటించింది. టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. బుధవారం పరిమతి ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడంతో వన్డే, టీ20 కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరించనున్నాడు.
దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2013 డిసెంబర్‌లో చివరిసారిగా భారత జట్టు తరఫున యువరాజ్ సింగ్ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు జట్టుకు దూరంగానే ఉన్నాడు.
భారత జట్టులోకి మళ్లీ వస్తానని, నీలం రంగు జెర్సీ ధరిస్తానని గతంలో యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అతడు అనుకున్నట్లే జట్టులోకి పునరాగమనం చేశాడు. 2016 17 రంజీ సీజన్‌లో యువరాజ్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. బరోడా జట్టుపై డబుల్ సెంచరీని కూడా సాధించాడు.
ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని జట్టులోకి తీసుకోవడం జరిగిందని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ జట్టును ప్రకటించే సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కాకుండా ఒక డబుల్ సెంచరీతో పాటు 180 కూడా స్కోర్ చేసి చక్కని ఫామ్ కనబర్చాడని ఆయన గుర్తు చేశారు.
అందుకే యూవీకి రెండు ఫార్మెట్‌లలో అవకాశం ఇచ్చామని తెలిపారు. తామంతా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ జట్టుని ఎంపిక చేశారమని, ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నామని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం కోహ్లీ వల్లే యువీకి భారత జట్టు చోటు దక్కిందని అంటున్నారు.
భారత జట్టులో యువరాజ్ సింగ్ తిరిగి చోటు దక్కించుకోవడంతో అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
యువరాజ్ సింగ్ పునరాగమనం
ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌కు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించిన 15 మంది జట్టు సభ్యులలో యువరాజ్ సింగ్ చోటు దక్కించుకున్నాడు.
యువీ రాకతో అభిమాని పట్టరాని ఆనందం
యువరాజ్ సింగ్ తిరిగి చోటు దక్కించుకోవడంతో అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
యువరాజ్ సింగ్ అభిమాని
యువీ తిరిగి జట్టులోకి వచ్చాడు. మళ్లీ నీ దశ తిరగనుంది.
నవీన్
కింగ్ ఈజ్ బ్యాక్ ఇన్ స్టైల్. క్రికెట్‌ను శాసించేందుకు యువరాజ్ సింగ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు.
విక్రాంత్ గుప్త
వన్డే, టీ20 జట్టులోకి యువరాజ్ సింగ్ పునరాగమనం చేశాడు. టీ20 జట్టులో ఆశిష్ నెహ్రా చోటు దక్కించుకున్నాడు.
వైస్ కెప్టెన్ ఎవరు?
వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అధికారికంగా నియమితుడయ్యాడు. యువీ కూడా జట్టులోకి వచ్చాడు. మరి వైస్ కెప్టెన్ ఎవరు? అశ్విన్ లేక రహానే.
భారత్ కుర్దా
వన్డే, టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ధోనీ ప్రకటించిన తర్వాత ఎంపిక చేసిన తొలిజట్టు ఇదే కావడం విశేషం. యువీ జట్టులోకి రావడం సంతోషంగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications