సింహాలకు టైమ్ వచ్చింది: ధోని-యువీలపై ఎవరేమన్నారు
హైదరాబాద్: కటక్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో సెంచరీలు సాధించిన యువీ-ధోనిల జోడీపై ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. కటక్ వన్డేలో టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఐదు ఓవర్లలో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్లు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటవగానే అభిమానులు నిరాశపడ్డారు. దీంతో టీమిండియా ఎక్కువ స్కోరు చేయడం కష్టమని భావించారు. ఈ సమయంలో ఓ అద్భుతం జరిగింది. వెటరన్ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్ పాత రోజుల్ని గుర్తుకు తెస్తూ రెచ్చిపోయారు.
వీరిద్దరి జోడి పోటీపడి ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ 150, ధోని 134 పరుగులతో అద్భుతమైన సెంచరీలు సాధించారు. యువరాజ్ సింగ్ ఆరేళ్ల తర్వాత, ధోని నాలుగేళ్ల తర్వాత సెంచరీలు చేసి తమలో ఇంకా సత్తా ఉందని నిరూపించుకున్నారు.
ఇన్నాళ్లు స్థాయికి తగ్గట్టు ఆడలేదని విమర్శలు ఎదుర్కొన్న యువరాజ్, ధోనిలు కటక్ వన్డేలో తమ అద్భుతమైన ఆటతీరుతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. జట్టులో తమ స్థానాలను పదిలం చేసుకోవడంతో పాటు యువ ఆటగాళ్లు నిలకడగా రాణించలేకపోతున్న తరుణంలో మేమున్నామంటూ భరోసా ఇచ్చారు.
వీరిద్దరి జోడీ రికార్డు స్థాయిలో 256 పరుగుల పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రపంచంలో నాలుగో వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. రెండో వన్డేలో పరుగుల వరద పారించిన యువీ, ధోనీలపై ట్విట్టర్‌లో ప్రశంసలు వెల్లువెత్తాయి.
మహమ్మద్ కైఫ్
ధోనీ, యువీ భాగస్వామ్యం చూడచక్కగా ఉందని, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన సందర్భాన్ని గుర్తుచేశారు
కెవిన్ పీటర్సన్
అద్భుత ఆటతీరు ప్రదర్శించావని, మెల్‌బోర్న్ నుంచి ప్రేమను పంచుతున్నాను
షారుక్ ఖాన్
యువీ, ధోనిల ఆటతీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మైదానంలో వీళ్లిద్దరూ సింహాల్లా ఆడుతున్నారని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ అన్నారు. షారుక్ నటించిన ‘రేయిస్' చిత్రంలో ఉన్న డైలాగ్‌తో పోల్చి వారిద్దరిని ప్రశంసించాడు.
వీరేంద్ర సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. పాతనోట్లు మాత్రమే చెలామణిలో లేవు.. వెటరన్లు యువీ, ధోనీలో అద్భుతమైన ఆట ఉంది అంటూ ట్వీట్ చేశాడు.
అంజుమ్ చోప్రా
ఈ శతకం ఎంతో ప్రత్యేకమైందని, ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా ట్వీట్ చేశారు.
సచిన్ టెండూల్కర్
బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. యువీ, ధోనీలు అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారని ట్వీట్ చేశాడు. యువీని సూపర్ స్టార్ గా, ధోనీని రాక్ స్టార్ గా అభివర్ణించాడు. వీరి ఆటను ఎంజాయ్ చేశానని ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
జేమ్స్ టైలర్
యువరాజ్ ఎంతో ప్రత్యేకమైన ఘనత సాధిం��ాడని, తెలివైన ఆటగాడని, కష్టాలను అధిగమించాలని కోరుకుంటున్నానని ఇంగ్లాండ్ ఆటగాడు జేమ్స్ టైలర్ అన్నాడు.
ఇంగ్లాండ్ క్రికెటర్ కబీర్ అలీ
రాక్‌స్టార్ యువరాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రెడిట్ విరాట్‌కి కూడా చెందుతోందని ఇంగ్లాండ్ క్రికెటర్ కబీర్ అలీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications