న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఔట్ ఎలా అయ్యాడబ్బా!: క్రికెట్‌లోనే వింత వీడియోని పోస్ట్ చేసిన యువీ

By Nageshwara Rao

హైదరాబాద్: ఇప్పటివరకు క్రికెట్‌లో మనం ఎన్నో రకాల ఔట్లను చూసి ఉంటాం. అయితే ఈ ఔట్ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా బ్యాట్స్‌మన్ క్యాచ్‌ ఔట్‌, రనౌట్‌, ఎల్బీడబ్ల్యూ ఔటవుతాడు. కానీ కింది వీడియోలో బ్యాట్స్‌మన్‌ ఎలా ఔటయ్యాడో ఎవరికీ అర్ధం కావడంలేదు.

 బంతి బ్యాట్‌ను టచ్ చేయలేదు

బంతి బ్యాట్‌ను టచ్ చేయలేదు

బౌలర్ వేసిన బంతి బ్యాట్‌ను టచ్ చేయలేదు, స్టంప్స్‌ను టచ్ చేయలేదు... ఇక ఎల్బీడబ్ల్యూ అయ్యే ఛాన్సే లేదు. అంతేకాదు ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అప్పీల్‌ చేయలేదు. కానీ అంఫైర్ మాత్రం బ్యాట్స్‌మన్ ఔట్ అయ్యాడని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

యువీ ఇనిస్టాగ్రామ్‌లో వీడియో

ఇందుకు సంబంధించిన వీడియోని టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ తాజాగా తన ఇన్‌స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీన్ని చూసిన వాళ్లంతా బ్యాట్స్‌మెన్‌ ఎలా ఔట్‌ అయ్యాడో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. అసలు వీడియోలోని బ్యాట్స్‌మన్ ఎలా ఔట్‌ అయ్యాడో చెప్పాలంటూ యువరాజ్‌ను కోరుతున్నారు. యువీ పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 నెటిజన్లు ఇలా

నెటిజన్లు ఇలా

కొందరు నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. 2007లో ఓవల్‌లో సర్రే లీడ్స్‌-బ్రాడ్‌ఫోర్డ్‌ యూసీసీఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు క్రికెట్ అభిమానులు తెలిపారు. బ్యాట్స్‌మెన్‌ టామ్‌ మెరిలాట్‌ అని, బౌలర్‌ మహమ్మద్‌ అక్రమ్‌ అని, అంపైర్‌ ఇయాన్‌ గౌల్డ్‌గా చెప్పారు.

 హిట్‌ వికెట్‌‌గా ఔటైన బ్యాట్స్‌మన్

హిట్‌ వికెట్‌‌గా ఔటైన బ్యాట్స్‌మన్

అంతకు ముందు ఓవర్‌లో బ్యాట్స్‌మెన్‌ హిట్‌ వికెట్‌‌గా ఔటయ్యాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం హిట్‌ వికెట్‌ అనంతరం బ్యాట్స్‌మెన్‌ ఒక బంతిని ఆడి అనంతరం క్రీజును వదిలి వెళ్లాలి. అలా టామ్‌ తదుపరి ఓవర్లోని తొలి బంతి ఆడిన తర్వాత వెంటనే అంపైర్‌ ఔటయినట్లు ప్రకటించాడని నెటిజన్లు పేర్కొన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 11:56 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X