న్యూఢిల్లీ: క్రికెట్లో విలక్షణమైన యాక్షన్ కలిగిన బౌలర్లు ఎందరో ఉన్నారు. వీరిలో చాలా మంది తమ విభిన్నమైన యాక్షన్‌తోనే సక్సెస్ సాధించారు. శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా, భారత్ యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా, అఫ్టానిస్థాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ ఇదే జాబితాలోకి వస్తారు. అయితే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తాజాగా పంచుకున్న ఓ వీడియో అందర్ని ఆకట్టుకుంటుంది.
ఈ వీడియోలోని ఓ బౌలర్ యాక్షన్ పిచ్చెక్కిస్తుంది. క్రికెట్లో మరెవరూ చేయని రీతిలో అతని బౌలింగ్ శైలి ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. డ్యాన్స్ మాదిరి ఉన్న ఆ బౌలింగ్ యాక్షన్‌కు ముగ్దుడైన యువీ.. 'భరతనాట్యం స్టైల్ ఆఫ్ స్పిన్.. ఏమంటావ్ భజ్జీ'అనే క్యాప్షన్‌తో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ వైరల్ అయింది.
లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన యువరాజ్ తన కెరీర్లో 148 వికెట్లు తీశాడు. వన్డేల్లో 111, టెస్ట్‌ల్లో 9, టీ20ల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఇక 17 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కలిగిన యువరాజ్ సింగ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున చివరిసారిగా 2017లో ఆడాడు. అనంతరం కెనడాలో జరిగిన గ్లోబర్ టీ20 టోర్నీలో, అబుదాబి వేదికగా జరిగిన టీ10 లీగ్‌లో పాల్గొన్నాడు. అయితే దేశవాళీ క్రికెట్లో మళ్లీ రావలన్న ప్రయత్నించగా.. బీసీసీఐ నిరాకరించింది. ఇక భారత్ గెలిచిన రెండు ప్రపంచకప్ ( 2007 టీ20, 2011 వన్డే)ల్లో యువీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.