న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీకు గొయ్యి తవ్వుతా.. హిందీ డైలాగ్‌తో నవ్వులు పూయిస్తున్న గేల్ (వీడియో)!!

 Yuvraj Singh Shares Funny Video Of Chris Gayles Failed Attempt At Hindi
Yuvraj Singh Shares Funny Video Of Chris Gayle

ముంబై: వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌, యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ తన బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తాడు. మరోవైపు తనదైన శైలిలో డాన్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. మైదానంలో ఎంత గంభీరంగా ఉన్నా.. ఆవల మాత్రం చాలా సరదాగా ఉంటాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) ద్వారా భారత అభిమానులకు ఎంతో చేరువ అయ్యాడు. అయితే తాజాగా గేల్‌కి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్‌ మీడియాలో అభిమానులచే నవ్వులు పూయిస్తోంది.

<strong>నా పనితీరు బీసీసీఐకి నచ్చలేదేమో.. ఓ ప్రొఫెషనల్‌గా బోర్డు నిర్ణయాన్ని గౌరవిస్తా: మంజ్రేకర్‌</strong>నా పనితీరు బీసీసీఐకి నచ్చలేదేమో.. ఓ ప్రొఫెషనల్‌గా బోర్డు నిర్ణయాన్ని గౌరవిస్తా: మంజ్రేకర్‌

 సరదా వీడియో:

సరదా వీడియో:

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌తో కలిసి క్రిస్‌ గేల్‌ ఒక సరదా వీడియోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ హిందీ డైలాగ్‌ చెప్పి నవ్వులు పూయించాడు. ఆ వీడియోలో యువీ.. గేల్‌ వెనుక ఉండి డైలాగ్‌ను అందివ్వడం కనిపించింది. దీంతో గేల్‌ చాలా హాస్యాస్పదంగా ఆ డైలాగ్‌ చెప్పాడు. యువీ డైలాగ్ చెబుతున్నా.. అతను చెప్పలేకపోయాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్లందరూ నవ్వు ఆపులేకపోయారు.

హిందీలో గేల్ డైలాగ్స్:

యువరాజ్ సింగ్ పోస్ట్ చేసిన వీడియోలో.. 'కాన్ఫిడెన్స్‌ మేరా.. ఖబర్‌ బనేగి తేరి!' అనే డైలాగ్‌ను గేల్‌తో పలికించేందుకు ట్రై చేశాడు. అయితే కాన్ఫిడెన్స్‌ మేరా.. అనే పదాన్ని బాలీవుడ్‌ సినిమా స్థాయిలో జోష్‌గా చెప్పినా మిగతా సగం మాత్రం ఇష్టమొచ్చినట్టుగా పలకడంతో యువీ సహా అక్కడున్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ముఖ్యంగా యువీ.. యూనివర్స్‌ బాస్‌ పలికిన సంభాషణకు నవ్వులు ఆపుకోలేకపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

పంజాబ్ తరఫున బరిలోకి:

పంజాబ్ తరఫున బరిలోకి:

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో క్రిస్ గేల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్.. వచ్చే నెల 15వ తేదీకి వాయిదా పడింది. అప్పటి పరిస్థితులను బట్టి ఐపీఎల్‌ని ఎలా నిర్వహించాలా అనే విషయంపై బీసీసీఐ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

యవ్వనంగా మారుతున్నా:

యవ్వనంగా మారుతున్నా:

ఇటీవల స్పోర్ట్స్ ఛానెల్‌తో ముఖాముఖిలో గేల్ మాట్లాడుతూ... 'ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్‌ మ్యాచ్‌లు ఆడుతున్నా. ఎందుకంటే ఆటకు నేను చేయాల్సింది చాలా ఉందని నా నమ్మకం. అందుకు నా శరీరం కూడా సహకరిస్తుంది. ఇందుకు చాలా సంతోషంగా ఉన్నా. రోజులు గడిచేకొద్ది నేను యవ్వనంగా మారుతున్నా. నేను ఆడితే చూడాలని చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారు. నాక్కూడా క్రికెట్‌పై ఇంకా ఇష్టం పోలేదు. 45 అనేది మంచి సంఖ్య. 45 ఏళ్ల వరకు కొనసాగితే బాగుంటుంది. నాకు ఆటపట్ల ప్రేమ, అభిరుచి, అంకితభావం ఉన్నాయి. వీలైనంత కాలం కొనసాగడానికి ప్రయత్నిస్తా' అని అన్నాడు.

Story first published: Monday, March 16, 2020, 10:35 [IST]
Other articles published on Mar 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X