Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలి.. యాషెస్ కంటే పెద్ద సిరీస్ అవుతుంది'

Yuvraj Singh, Shahid Afridi Bat For India-Pakistan Bilateral Series

న్యూఢిల్లీ: దాయాదులు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కోరుకుంటున్నాడు. ఒకవేళ దాయాదుల మధ్య మ్యాచ్‌ జరిగితే ఆటకి ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా ఇదరూ దేశాల మధ్య మ్యాచ్‌లు జరిగితే యాషెస్ కంటే పెద్ద సిరీస్ అవుతుందని పేర్కొన్నాడు. అఫ్రిది కూడా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలన్నాడు.

నాకు ఇప్పటికీ గుర్తుంది:

నాకు ఇప్పటికీ గుర్తుంది:

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యువరాజ్ మాట్లాడుతూ... '2004, 2006, 2008 పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు కూడా క్రికెట్ ఆడే పరిస్థితులు ఉన్నాయి. కానీ.. అది మన చేతిలో లేదు. మనందరం క్రికెట్‌ని ప్రేమిస్తాం. కానీ.. మన ప్రత్యర్థులు ఎవరు అనేది మనం నిర్ణయించలేం. అయితే దాయాదుల మధ్య మ్యాచ్‌ జరిగితే అది ఆటకి ఎంతో ఉపయోగపడుతుంది' అని చెప్పుకొచ్చాడు.

 యాషెస్ కంటే పెద్ద సిరీస్:

యాషెస్ కంటే పెద్ద సిరీస్:

'భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సిరీస్ ఉంటుందని అనుకుంటున్నా. సిరీస్ ఉంటే కనుక యాషెస్ కంటే పెద్ద సిరీస్ అవుతుంది. క్రీడా అభిమానులకు రాజకీయాలు అడ్డురాకూడదు. ఇరు దేశాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి కూర్చుని మాట్లాడుకోవాలి' అని షాహిద్ అఫ్రిది అన్నాడు. భారత్-పాకిస్థాన్ 2013 నుండి ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. ఇక చివరిసారిగా 2008లో టెస్ట్ సిరీస్ ఆడారు.

6 బంతుల్లో 2 పరుగులు:

6 బంతుల్లో 2 పరుగులు:

గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్.. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్థం మళ్లీ బ్యాట్ పట్టాడు. గత ఆదివారం ఆస్ట్రేలియాలో జరిగిన ఛారిటీ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసి వికెట్ పడగొట్టిన యువీ.. బ్యాట్‌తో మాత్రం మెరుపుల్ని మెరిపించలేకపోయాడు. 6 బంతుల్లో 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

 ఐసీసీ టోర్నీలలో మాత్రమే:

ఐసీసీ టోర్నీలలో మాత్రమే:

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్ని విబేధాల కారణంగా ఇరు జట్ల మధ్య గత కొంతకాలంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీలలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు పాక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బీసీసీఐ మాత్రం ఒప్పుకోవట్లేదు. ఈ నేపథ్యంలో కొందరు మాజీలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరిస్‌ జరిగాలని అంటున్నారు. తాజాగా ఈ జాబితాలో యువరాజ్ కూడా చేరిపోయాడు.

Story first published: Wednesday, February 12, 2020, 12:45 [IST]
Other articles published on Feb 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+