Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువరాజ్‌ దీపావళి స్పెషల్ ఆఫర్.. సహాయం చేసి బహుమతి పొందండి!!

Yuvraj Singh says This Diwali to make a difference, Spread light and joy into everyone lives

ముంబై: ఆదివారం దీపావళి పండగను భారత క్రికెటర్లు, మాజీలు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ దీపావళి సందర్భంగా ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. అందరి జీవితాల్లో వెలుగుల్ని నింపే ఈ దీపావళి పండుగను మరి కాస్త ప్రత్యేకంగా జరుపుకుందామంటూ ట్విటర్‌ వేదికగా ఓ వీడియో ద్వారా వినూత్నంగా పిలుపునిచ్చాడు. అంతేకాదు అభిమానులకు బహుమతులు కూడా అందజేయనున్నాడు.

సహాయం చేయండి.. బహుమతి పొందండి:

'దీపావళి పండగ అంటే వెలుగులు, సంతోషాల కలయిక. ఈ పండుగ ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమే. కానీ.. చాలా మంది తమ జీవితాల్లో వెలుగులు, సంతోషాలకు నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వారికోసం మన వంతుగా ఏదో ఒక రూపంలో సాయం చేయాలి. ఒక మంచి పనిలో భాగస్వామ్యలు కావడానికి మీకు అదే అద్భుత అవకాశం. వారికి మీరు చేసిన గొప్ప సహాయాన్ని ట్విటర్‌లో #CelebrateForACause హ్యాష్‌ట్యాగ్‌తో @YWCOfficial ఖాతాకు ట్యాగ్‌ చేసి పోస్ట్‌ చేయండి. దీనికి బదులుగా మీరు బహుమతులు కూడా పొందవచ్చు' అంటూ యువీ వీడియోలో పేర్కొన్నాడు.

ఎలాంటి బహుమతి ఇస్తాడో ?:

ఎలాంటి బహుమతి ఇస్తాడో ?:

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్ట్ చేసిన కొద్దీ నిమిషాల్లోనే చాలా లైకులు, షేర్లు వచ్చాయి. అభిమానులు యువరాజ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. సాయం చేసిన అభిమానులకు యువరాజ్‌ ఎలాంటి బహుమతి ఇస్తాడో అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఈ కార్యక్రమంలో మీరూ భాగస్వామ్యులు కండి బహుమతి పొందండి.

ప్రత్యేక ఆకర్షణగా యువరాజ్ జంట:

ప్రత్యేక ఆకర్షణగా యువరాజ్ జంట:

దీపావళి పండుగను పురస్కరించుకుని శనివారం ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లకు ఆ జట్టు యజమాని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, చైర్ పర్సన్ నీతా అంబానీలు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్‌లు కుటుంబంతో సాహా హాజరయ్యారు. యువరాజ్ తన భార్యతో కలిసి కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

బుమ్రా ఎక్కడ:

బుమ్రా ఎక్కడ:

ముంబై ఇండియన్స్ జట్టు కోచ్ మహేల జయవర్దనే, పాండ్యా సోదరులు, ఇషాన్ కిషన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు ఈ పార్టీకి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ కార్యక్రమానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు ముంబై ఇండియన్స్‌ ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా హాజరుకాలేదు. ఓ అభిమాని బుమ్రా ఎక్కడ.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు వెళ్లిపోయాడా? అంటూ ట్విట్టర్‌లో ఓ ప్రశ్న సంధించాడు

Story first published: Sunday, October 27, 2019, 14:54 [IST]
Other articles published on Oct 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+