
భారత్ గెలవాలని కోరుకుంటున్నా
తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన యువరాజ్ సింగ్ ఫైనల్స్‌లో భారత్ గెలవాలని ఉన్నా.. న్యూజిలాండ్‌కే కాస్త ఎక్కువ అనుకూలత ఉందన్నాడు. 'టెస్టు క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లడం మంచి ఆలోచన. భారత్ బలంగా ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇటీవలి కాలంలో కోహ్లీసేన విదేశాల్లో అద్భుతంగా రాణిస్తోంది. ఎక్కడైనా విజయం సాధిస్తామనే ధీమా ఆటగాళ్లలో నెలకొంది. అయితే, ఇంగ్లండ్‌లోని పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. మరోవైపు డ్యూక్‌బాల్ కూడా ప్రభావం చూపిస్తాయి. ఆటగాళ్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి కాస్త సమయం దొరకడంతో భారత్ గెలవాలని కోరుకుంటున్నా' అని యువీ అన్నాడు

మూడు టెస్టులు ఉండుంటే బాగుండేది:
'భారత్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ పరంగా ఇరు జట్లూ సమానంగా ఉన్నాయి. అయితే భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2021 ఆడి నేరుగా టెస్టు క్రికెట్ ఆడాలంటే కాస్త కష్టమే. పరిస్థితులకు బాగా అలవాటు పడితేనే అక్కడి పిచ్‌లను అర్థం చేసుకునే వీలు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ నేరుగా టెస్టు క్రికెట్ ఆడటం అంత తేలిక కాదు.
ఇంగ్లండ్‌తో కివీస్ రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో ఆ జట్టుకు కాస్త ఎక్కువ అవకాశాలున్నాయి. కోహ్లీసేనకు ఇది కొంచెం ప్రతికూలాంశం. మ్యాచ్‌కు ముందు 8-10 ప్రాక్టీస్ సెషన్లు ఉన్నాయి. అయితే మ్యాచ్ ప్రాక్టీస్‌కు ఇవి ప్రత్యామ్నాయం కాలేవు' అని యువీ పేర్కొన్నాడు. ఫైనల్లో మూడు టెస్టులు ఉండుంటే బాగుండేదని, ఎందుకంటే ఒక మ్యాచ్‌లో ఓడినా తర్వాత రెండింటిలో పుంజుకుని ఆడొచ్చని మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

ఓపెనింగ్ జోడీ డ్యూక్ బంతికి త్వరగా అలవాటు పడాలి
ఇంగ్లండ్‌లో తొలిసారి ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ శర్మ, శుభమన్ గిల్ జోడీ డ్యూక్ బంతికి త్వరగా అలవాటు పడాలని యువీ అన్నాడు. 'రోహిత్ శర్మ టెస్టులో అనుభవజ్ఞుడైన ఆటగాడు. ఇప్పటికే ఏడు సెంచరీలు చేశాడు. ఓపెనర్‌గా నాలుగు శతకాలు బాదాడు. కానీ రోహిత్, గిల్ కలిసి గతంలో ఇంగ్లండ్‌లో ఓపెనర్లుగా దిగలేదు. అక్కడ డ్యూక్ బంతి త్వరగా స్వింగ్ అవుతుంది. వారికి ఇది సవాల్ లాంటిది.
కాబట్టి పరిస్థితులకు త్వరగా అలవాటుపడాలి' అని యువరాజ్ సూచించాడు. గిల్ తన అరంగేట్ర సిరీస్ ఆస్ట్రేలియాలో చేసిన అద్భుత ప్రదర్శనను గుర్తుచేసుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నాడు. ఆత్మివిశ్వాసం రెట్టింపు అయితే ప్రపంచంలో ఎక్కడైనా బాగా ఆడగలడని అన్నాడు.


Click it and Unblock the Notifications












