న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆధునిక క్రికెట్ పరంగా సెలెక్టర్ల ఆలోచన బాగాలేదు.. మనకు మంచి సెలక్టర్లు అవసరం'

Yuvraj Singh Says BCCI Definitely Need Better Selectors || Oneindia Telugu
Yuvraj Singh said Selectors thinking in terms of modern day cricket is not up to the mark

ముంబై: ఆధునిక క్రికెట్ పరంగా సెలెక్టర్ల ఆలోచన బాగాలేదు. టీమిండియాకు మంచి సెలక్టర్లు అవసరవమని భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. గాయాలపాలైనా లేదా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా భారత క్రికెటర్లు మ్యాచ్ ఆడక తప్పడం లేదన్నాడు. ఆడని పక్షంలో జట్టులో చోటు గల్లంతవుతుందనే ఆందోళనతో విధిలేని పరిస్థితుల్లో ఆటగాళ్లు మైదానంలోకి దిగుతున్నారు అని యువీ పేర్కొన్నాడు.

<strong>భూటాన్‌లో 'బర్త్‌డే బాయ్' కోహ్లీ.. అనుష్కతో విహారం!!</strong>భూటాన్‌లో 'బర్త్‌డే బాయ్' కోహ్లీ.. అనుష్కతో విహారం!!

మంచి సెలక్టర్లు అవసరం

మంచి సెలక్టర్లు అవసరం

తాజాగా యువరాజ్‌ ముంబైలోని విలేకరులతో మాట్లాడుతూ... 'టీమిండియాకు కచ్చితంగా మంచి సెలక్టర్లు అవసరం. మన సెలక్టర్ల బాధ్యత అంత సులువైనది కాదు. సెలక్టర్లు 15 మందిని ఎంపిక చేసిన తర్వాత ఇతర ఆటగాళ్లను ఎందుకు ఎంపికవ్వలేదని చర్చలు జరుగుతాయి. అన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆటగాళ్లకు అండగా నిలవడంలో నేను ముందుంటాను' అని అన్నాడు.

ఇతర దేశాల్లో వేరేలా ఉంటుంది

ఇతర దేశాల్లో వేరేలా ఉంటుంది

'ఆటగాళ్ల గురించి నెగిటివ్‌గా మాట్లాడితే ఒత్తిడికిలోనై అంతగా రాణించలేరు. ఆటగాళ్లకు ఎప్పుడూ మద్దతు ఇస్తూ వారిని ప్రోత్సహించాలి. విఫలమైన సమయంలో కూడా అండగా నిలవాలి. ఇతర దేశాల్లో ఆటగాళ్లు ఒత్తిడికిలోనైనా, మానసికంగా బాగా లేకపోయినా వారికి విశ్రాంతి ఇచ్చి తిరిగి జట్టులోకి తీసుకుంటారు. ఇటీవలే గ్లెన్ మాక్స్‌వెల్‌ విరామం తీసుకున్నాడు. కానీ, మన దేశంలో దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది' అని యువరాజ్‌ మండిపడ్డాడు.

ఆటగాళ్లకు మద్దతు అవసరం

ఆటగాళ్లకు మద్దతు అవసరం

'కొంత విరామం తీసుకుంటే జట్టులో చోటు కోల్పోతామని ఆటగాళ్లు ఆందోళన చెందుతారు. కాబట్టి వారికి మద్దతు చాలా అవసరం. క్రికెటర్లకు సంఘం ఉండాల్సిందే. ఆడే పరిస్థితి లేకపోయినా.. చాలా సందర్భాల్లో మేం బరిలోకి దిగక తప్పడం లేదు. లేదంటే జట్టులో చోటుకోల్పోతామనే భయం మమ్మల్ని వెంటాడుతుంది' అని యువరాజ్‌ పేర్కొన్నాడు.

సెలక్టర్లను అడగాలి

సెలక్టర్లను అడగాలి

ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం పలికిన సంగతి తెలిసిందే. అయితే ఎంఎస్ ధోనీ భవితవ్యం గురించి ఓ విలేకరి ప్రశ్నించిగా.. 'దాని గురించి సెలక్టర్లను అడగాలి' యువరాజ్‌ తెలిపాడు. రిషబ్ పంత్ కొంత గందరగోళానికి గురయ్యాడు. బంతిని కొట్టాలా లేక స్ట్రైక్ రొటేట్ చేయాలనే విషయం కొంచెం తెలియదు. నిన్న రాత్రి అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొంత సమయం క్రీజులో నిలబడ్డాడు. కుదురుకోవడానికి సమయం పడుతుంది' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, November 5, 2019, 10:25 [IST]
Other articles published on Nov 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X