For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్‌ లోపాన్ని బయటపెట్టిన అతని భార్య

Yuvraj Singhs Wife Hazel Keech Reveals His Biggest Drawback

న్యూ ఢిల్లీ: ఫామ్ లేకపోవడంతో టీమిండియాలో చోటు కోల్పోయిన యువరాజ్ సింగ్ మళ్లీ తన సత్తా చాటుతాననే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో బ్రిటీష్‌ మోడల్‌, యువీ సతీమణి హేజిల్‌ కీచ్‌ తన భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో యువీ గురించి, వివాహ జీవితం గురించి పలు విషయాలు వెల్లడించారు.

జట్టులో చోటు దక్కలేదని బాధ పడడు:

జట్టులో చోటు దక్కలేదని బాధ పడడు:

యువీ మంచి మనసున్న వ్యక్తి. ప్రతీ ఒక్కరిలోనూ ప్రతిభను, మంచితనాన్ని మాత్రమే గుర్తిస్తాడు. కానీ వారిలోని చెడు స్వభావం గురించి ఆలోచించడు, పట్టించుకోడు. ప్రస్తుత పిరిస్థితుల్లో యువీ అంత మంచిగా ఉంటే కుదరదు. జట్టులో చోటు దక్కడం లేదని ఎప్పుడూ బాధ పడడు. యువీ ఒకరిని మాట అనడు, విమర్శించడు ఆ గుణమే నాకు చాలా నచ్చింది. కానీ అదే అతడికి అతిపెద్ద లోపం. జట్టులో స్థానం కాపాడుకోవాలన్నా, సుస్థిరం చేసుకోవాలన్నా ఆ రెండూ అవసరమే‌'అని తెలిపారు.

 అవకాశం వస్తే సమాధానానికి సిద్దం:

అవకాశం వస్తే సమాధానానికి సిద్దం:

ఇప్పటికే క్రికెట్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. మరోసారి అవకాశం వస్తే తన ఆటతీరుతో అందరికీ సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నాడు. మా వివాహం జరిగిన కొద్ది రోజులకే యువీకి తిరిగి టీమిండియాలో చోటు దక్కింది. విదేశీ టూర్ల నేపథ్యంలో చాలా నెలలు యూవీని చూసే వీలు లేకుండాపోయిందంటూ హేజిల్‌ తన మనసులోని మాటలను బయటపెట్టారు.

యువరాజ్ చివరగా 2017 జూన్‌ 30న:

యువరాజ్ చివరగా 2017 జూన్‌ 30న:

ఇప్పటివరకు భారత్ తరపున యువరాజ్‌ సింగ్ 304 వన్డేలాడి 8,701 పరుగులు చేశాడు. అలాగే 40 టెస్టు మ్యాచ్‌లతో పాటు 58 టీ20 మ్యాచ్‌లాడాడు. 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డుని సైతం అందుకున్నాడు. 2011లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్‌లో మ్యాన్‌ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని కూడా సాధించాడు. భారత్ తరపున యువరాజ్ సింగ్ చివరగా 2017 జూన్‌ 30న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడాడు.

యో-యో టెస్టులో విఫలమైతేనే యువీకి చోటు:

యో-యో టెస్టులో విఫలమైతేనే యువీకి చోటు:

టీమిండియాలో స్థానం కోల్పోయిన యువరాజ్‌.. చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే, జట్టులో చోటు దక్కించుకోవాలంటే ముందుగా అతడు యో-యో టెస్టులో పాసవ్వాలి. గతంలో పలుమార్లు యో-యో టెస్టులో విఫలం కావడంతో భారత జట్టులో యువీకి చోటు దక్కడం కష్టమేనంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

Story first published: Wednesday, October 3, 2018, 11:00 [IST]
Other articles published on Oct 3, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+