ఎందుకు?: పెళ్లి తర్వాత యువీ భార్య హాజెల్ పేరు మార్పు
హైదరాబాద్: సిక్కు సంప్రదాయ పద్ధతిలో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి, మోడల్ హాజెల్ కీచ్‌ల వివాహం నవంబర్ 30వ తేదీన చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం 'బాబా రాందేవ్ సింగ్ డేరా'లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 2 (శుక్రవారం) హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకునేందుకు నూతన వధూవరులు ఇప్పటికే గోవాకు చేరుకున్నారు. అయితే గురుద్వారాలో వివాహ అనంతరం హాజెల్ కీచ్ పేరును 'గుర్బసంత్ కౌర్'గా మార్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హాజెల్‌ని గుర్బసంత్ అని సంభోదించారట
పంజాబీ సంప్రదాయం ‘ఆనంద్ కరాజ్' పద్ధతిలో యువరాజ్, కీచ్‌ల వివాహం జరిగింది. గురుసాహెబ్ బల్వీందర్ సింగ్ వీరిద్దరి వివాహ తంతు జరిపిస్తుండగా ఆయన హాజెల్‌ని గుర్బసంత్ అని సంభోదించారట. దాంతో హాజెల్ పేరు వివాహం అనంతరం 'గుర్బసంత్ కౌర్' మార్చారట.

బాబా రామ్‌సింగ్ ఆశీర్వాదం
వివాహం అనంతరం నూతన దంపతులు బాబా రామ్‌సింగ్ ఆశీర్వాదాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే యువరాజ్ తల్లి షబ్నం సింగ్‌కు గురుసాహెబ్ బాబా రామ్ సింగ్ అంటే ఎనలేని గౌరవం. వివాహ అనంతరం ఆయన హాజెల్ పేరు మార్చాలని సూచించారట.

పేరు మార్పు అందుకే
అందుకే హాజెల్ పేరుని 'గుర్బసంత్ కౌర్' మార్చారని తెలుస్తోంది. అయితే హాజెల్ కీచ్ పేరు మార్చడానికి వేరే కారణం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం హాజెల్ రాజస్థాన్‌లో ఉన్నప్పుడు డబ్బు అవసరం పడి అక్కడ ఉన్న ఓ బ్యాంక్‌కు వెళ్లింది.

అమర్యాదకరంగా ప్రవర్తించాడు
అక్కడి బ్యాంకు ఉద్యోగి ఒకరు హాజెల్ పేరు విని ఆమె భారతీయురాలని కాదని డబ్బు ఇవ్వకపోగా ఆమెతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. ఈ విషయమై యువరాజ్ సింగ్‌తో, హాజెల్‌లు అప్పట్లో సోషల్‌మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహా వ్యక్తం చేశారు. ఆయితే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పేరు మార్చాకున్నారంటూ అంటున్నారు.

యువీ వివాహానికి యెగ్‌రాజ్ సింగ్ హాజరుకాలేదు
కాగా, చంఢీగడ్‌లో యువరాజ్, హాజెల్ కీచ్‌ల ఈ వివాహానికి యువీ తండ్రి యెగ్‌రాజ్ సింగ్ హాజరుకాలేదు. అయితే పెళ్లికి ముందు రోజు మంగళవారం రాత్రి జరిగిన మెహందీ, సంగీత్ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీమిండియా హాజరైన సంగతి తెలిసిందే.

గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం
బుధవారం చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా శుక్రవారం గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు. డిసెంబర్ 7న ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications