Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చీప్‌ పబ్లిసిటీ కోసమే: యువీకి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి?

హైదరాబాద్: టీమిండియా వెటనర్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహ హింస కేసు నమోదు అయినట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని యువీ తరుపు న్యాయవాది దమన్ బిర్ సింగ్ సోబ్తి ఖండించిన సంగతి తెలిసిందే.

మరోవైపు యువరాజ్ కుటుంబానికి నోటీసులు పంపించిన మాట వాస్తవమేనని గుర్‌గ్రామ్‌ పోలీసులు చెబుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో యువీ తల్లి షబ్నమ్‌ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత ఆకాంక్ష దేని కోసం ఇదంతా చేస్తోందో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.

అసలు యువీకి ఈ కేసుకు సంబంధం ఏంటి? ఆకాంక్ష యువరాజ్ సోదరుడు జొరావర్‌ సింగ్‌ భార్య మాత్రమే. బిగ్‌ బాస్‌తో సహా పలు ఇంటర్వ్యూల్లో ఆమె(ఆకాంక్ష) యువీ తనకు సోదరుడులాంటివాడని చెప్పిందని, అలాంటి వ్యక్తిపై కేసు పెట్టే ప్రయత్నం ఇప్పుడేందుకు చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువీకి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి?

యువీకి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి?

‘అసలు యువీకి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? ఆకాంక్ష యువీ తమ్ముడు జొరావర్‌ భార్య మాత్రమే. ప్రతిసారీ యువీ అరెస్ట్‌ అయ్యాడా అంటూ వస్తోన్న ప్రశ్నలకు చిత్రవధ అనుభవిస్తున్నాం. ఇప్పటివరకు ఆకాంక్ష ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో యువీ తనతో బాగానే ఉండేవాడని పేర్కొంది' అని ఆమె అన్నారు.

సోదరుడిలా అన్ని విషయాల్లో సాయపడేవాడని చెప్పింది

సోదరుడిలా అన్ని విషయాల్లో సాయపడేవాడని చెప్పింది

'ఓ సోదరుడిలా అన్ని విషయాల్లో సాయపడేవాడని చెప్పింది. ఇప్పుడేమో యువీపైనా కేసు పెట్టాలని చూసింది. అసలు ఆకాంక్ష ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుందో నాకు అర్థంకావడం లేదు. భర్త నుంచి దూరంగా ఉంటూ రెండేళ్ల తర్వాత ఆకాంక్ష దేనికోసం ఇదంతా చేస్తోందో అర్థం కావడంలేదు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

చీప్‌ పబ్లిసిటీకి పాల్పడుతోంది

చీప్‌ పబ్లిసిటీకి పాల్పడుతోంది

ఇదంతా తన భర్త జోరావర్ కోసం మాత్రం కాదని, ఆమె చీప్‌ పబ్లిసిటీకి పాల్పడుతోందని అన్నారు. యువరాజ్ ఓ సెలబ్రిటీ కాబట్టి.. అతని హోదాను అడ్డుపెట్టుకుని డబ్బు రాబట్టాలని చూస్తోందని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని, తనంతట తానే ఇంట్లోంచి వెళ్లిపోయిందని యువీ తల్లి పేర్కొంది.

చాలా రోజులుగా జొరోవర్‌, ఆకాంక్ష విడిగానే

చాలా రోజులుగా జొరోవర్‌, ఆకాంక్ష విడిగానే

జోరావర్​, ఆకాంక్షలు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ గతంలోనే కోర్టును ఆశ్రయించారని, అలాంటప్పుడు మళ్లీ గృహహింస కేసు వార్తలు రావడం వెనుక ఎవరో ఉన్నారని ఆమె అన్నారు. చాలా రోజులుగా జొరోవర్‌, ఆకాంక్ష విడిగానే ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

యువీ కుటుంబానికి నోటీసులు జారీ చేసిన పోలీసులు

యువీ కుటుంబానికి నోటీసులు జారీ చేసిన పోలీసులు

కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే విషయంపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. తాజాగా, యువరాజ్‌ కుటుంబ సభ్యులపై ఆకాంక్ష గురుగ్రామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యువీ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసుపై అక్టోబర్ 21న తొలి విచారణ జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+