Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెటర్ బ్యాట్స్‌మన్: శుభమాన్ గిల్ అద్భుత ప్రదర్శన వెనుక యువీ

Yuvraj Singh's guidance helped me become a better batsman: Shubman Gill

హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని గెలుచుకుని అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకున్నాడు శుభమాన్ గిల్. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో శుభమాన్ గిల్ కీలకపాత్ర పోషించాడు.

అయితే తాను టోర్నీలోనే అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి విలువైన సలహాలిచ్చి ప్రోత్సహించింది మాత్రం టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అని అన్నాడు. అండర్‌-19 వరల్డ్ కప్‌ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని సొంత చేసుకున్న భారత యువ జట్టు సోమవారం ముంబైకి చేరుకుంది.

భారత్ తిరిగొచ్చిన అనంతరం శుభమాన్ గిల్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేయడానికి కృషి చేసిన వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 'బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో యువీ పాజీ (యువరాజ్ సింగ్) ఆటకు సంబంధించిన కొన్ని మెలకువలు నాకు చెప్పాడు. మైదానంలో ఎలా వ్యవహరించాలనే దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాడు. అక్కడ నాతో బ్యాటింగ్ చేస్తూనే పలు సూచనలు ఇచ్చాడు' అని గిల్ తెలిపాడు.

18 ఏళ్ల శుభమాన్ గిల్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో సెమీ పైనల్లో అద్భుత సెంచరీతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగిన మ్యా‌చ్‌లో చివరి వరకు కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శం చేశారని తెలిపాడు.

'నిజానికి పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మాపై కొంచెం ఒత్తిడి నెలకొంది. మా ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. మధ్యలో వికెట్లు కోల్పోయినప్పటికీ రాహుల్ సర్ తనను ఇన్నింగ్స్ చివరి వరకు బ్యాటింగ్ చేస్తూ మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని సూచించారు' అని గిల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ కోసం బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన వేలంలో కనీసధర రూ.20 లక్షలతో వేలంలోకి వచ్చిన శుభమాన్‌ గిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.1.8 కోట్లకు కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

'వేలానికి ముందు రోజు బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరగడంతో బాగా అలసిపోయాను. లేచి చూసే సరికి వేలంలో కోల్‌కతా జట్టు కొనుగోలు చేసిందని తెలిసింది. ఆ సమయంలో నేను ఐపీఎల్ గురించి ఎంతమాత్రం ఆలోచించలేదని, నా దృష్టంతా వరల్డ్ కప్ పైనే ఉంది' అని శుభమాన్ గిల్ తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌లో శుభమాన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 6, 2018, 12:29 [IST]
Other articles published on Feb 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+