క్రికెట్ థీమ్‌తో యువీ పెళ్లికి వెరైటీ శుభలేఖ (ఫోటోలు)
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్, స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ పెళ్లితో యువీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గతేడాదిగా ప్రేమలో విహరిస్తున్న యువరాజ్, హాజెల్ కీచ్ ఈ నెలలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.
అయితే వీరి పెళ్లి తేదీ అధికారికంగా తెలియనప్పటికీ, వీరిద్దరి పెళ్లి కోసం రూపొందించిన వెడ్డింగ్ కార్డు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే యువరాజ్ సింగ్ తన పెళ్లి శుభలేఖ ద్వారా ఆటను ఎంతగా ప్రేమిస్తున్నాడో ప్రపంచానికి తెలిసేలా చేశాడు.

క్రికెట్ థీమ్‌తో రూపొందించిన పెళ్లికార్డులు
యువీ, హాజెల్ కార్టూన్లతో పాటు క్రికెట్ థీమ్‌తో రూపొందించిన పెళ్లికార్డులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీనికి, యువరాజ్ హాజెల్ ప్రీమియర్ లీగ్' (వైహెచ్‌పీఎల్) అనే టైటిల్‌ని యువీ పెట్టడం విశేషం. ఈ పెళ్లి శుభలేఖను ప్రముఖ డిజైనర్లు సండీ, కపిల్ ఖురానాలు రూపొందించారు.

తొలుత చండీఘడ్‌లోని గురుద్వారాలో
వీరి వివాహం తొలుత చండీఘడ్‌లోని గురుద్వారాలో సిక్కు సంప్రదాయం ప్రకారం నవంబర్ 30వ తేదీన, డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి యువీ పెళ్లి వేడులకు నిర్వహించనున్నట్టు సమాచారం. వివాహానికి ముందు యువీ ఫామ్‌హౌజ్‌లో సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

డిసెంబర్ 7న గ్రాండ్‌గా రిసెప్షన్
ఇక వివాహం అనంతరం ఓ ఢిల్లీలోని హోటల్‌లో డిసెంబర్ 7న గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ నాలుగు వేడుకలకు ఒక్కో డిజైన్‌లో ఒక్కో పత్రికను రూపొందించి వైహెచ్‌పీఎల్ పేరిట అతిథులకు అందించనున్నారు. కాగా, గోవాలో జరిగే వివాహానికి హాజెల్, యువీలకు సంబంధించి ఫన్నీ కార్టూన్స్‌తో కార్డు డిజైన్ చేయబోతున్నారు.

హాజెల్ కీచ్ బ్రిటిషర్ అయినా తల్లి హిందువు
గురుద్వారాలో జరిగే వివాహానికి మాత్రం తెలుపు, బంగారపు వర్ణంతో డిజైన్ చేశారు. కాగా, యువరాజ్ సింగ్‌కు కాబోయే భార్య హాజెల్ కీచ్ బ్రిటిషర్ అయినప్పటికీ తల్లి హిందువు కావడంతో మరోసారి హిందువుల సంప్రదాయంలోనూ వీరి వివాహం నిర్వహిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications