For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువీ వేగవంతమైన హాఫ్ సెంచరీ, 'తొలి' అవుట్‌తో బెంగళూరుకు చెక్

హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్‌ 35 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు .

హైదరాబాద్: హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్‌ 35 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు భారీ స్కోరు చేసింది.

యువరాజ్ దూకుడు

యువరాజ్ దూకుడు

యువరాజ్ సింగ్‌ (62) విధ్వంసక ఇన్నింగ్స్‌తో సన్ రైజర్స్‌కు భారీస్కోరు అందించాడు. అనంతరం బెంగళూరు చేతులెత్తేసింది. 19.4 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. కోహ్లి, డివిలియర్స్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్ల సేవలు కోల్పోయిన బెంగళూరు.. సన్ రైజర్స్‌కు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది.

క్రిస్ గేల్ ఆశలు నీరు

క్రిస్ గేల్ ఆశలు నీరు

బెంగళూరు ప్రధాన ఆశ క్రిస్ గేల్‌. సగం స్కోరు వరకైనా గేల్‌ ఉంటే విజయంపై ఆశలు పెట్టుకోవచ్చని ఆశించారు బెంగళూరు అభిమానులు. అందుకు తగ్గట్లే గేల్‌ (32) మెరుపులతో ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. ఆరంభంలో కొంచెం తడబడినా మూడో ఓవర్‌ నుంచి జూలు విదిల్చాడు.

గేల్ క్యాచ్ అవుట్

గేల్ క్యాచ్ అవుట్

మన్‌దీప్ సింగ్‌ (24) తోడయినట్లు కనిపించింది. బెంగళూరు ఇన్నింగ్స్‌కు మంచి పునాది పడింది. అయితే కెరీర్‌లో తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన అఫ్గానిస్తాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్ ఖాన్‌ (2/36) తన మొదటి ఓవర్లోనే మన్ దీప్‌ను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే దీపక్‌ హుడా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గేల్‌ క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో బెంగళూరు కథ ముగిసినట్లు కనిపించింది. ఆ తర్వాత ఒకరిద్దరు కొద్దిగా ఆడారు. ఆ తర్వాత మిగతా వారు వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు.

ఆకట్టుకున్న హైదరాబాద్

ఆకట్టుకున్న హైదరాబాద్

అభిమానుల అంచనాల నడుమ బరిలో దిగిన సన్ రైజర్స్‌ భారీ స్కోరుతో ఆకట్టుకుంది. టాస్‌ ఓడినా, కెప్టెన్‌ వార్నర్‌ (14) తక్కువ స్కోరుకే ఔటైనా, సన్ రైజర్స్‌ ఎక్కడా తగ్గలేదు. దేవధర్‌ ట్రోఫీలో గాడినపడ్డ శిఖర్‌ ధావన్‌ (40) ఫామ్‌ను కొనసాగించాడు. హెన్రిక్స్‌ (52)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో 5.2 ఓవర్లలోనే సన్ రైజర్స్‌ స్కోరు 50 పరుగులు దాటింది.

రెచ్చిపోయిన యువరాజ్

రెచ్చిపోయిన యువరాజ్

అర్ధ సెంచరీ దిశగా పయనిస్తున్న ధావన్‌ను బిన్నీ ఔట్‌ చేశాడు. హెన్రిక్స్‌కు యువరాజ్‌ తోడవడంతో స్కోరు బోర్డు మరింత జోరందుకుంది. 26 పరుగుల వద్ద లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న యువరాజ్ చెలరేగిపోయాడు.

సన్ రైజర్స్ దూకుడు

సన్ రైజర్స్ దూకుడు

అతడి మెరుపులతో సన్ రైజర్స్‌ 200 వైపు దూసుకెళ్లింది. హెన్రిక్స్‌తో కలిసి మూడో వికెట్‌కు 58 పరుగులు జోడించిన యువరాజ్.. దీపక్‌ హుడా (16 నాటౌట్‌)తో కలిసి నాలుగో వికెట్‌కు 39 పరుగులు జత చేశాడు. చివర్లో కటింగ్‌ (16 నాటౌట్‌) 2 సిక్సర్లు బాది జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు.

యువరాజ్ ఏమన్నాడంటే..

యువరాజ్ ఏమన్నాడంటే..

ప్రతి ఐపీఎల్‌లో కొత్తగా కనిపించాలని, అందుకే ఈసారి కొత్త కేశాలంకరణతో బరిలో దిగానని, టీమిండియాలో పునరాగమనం చేయాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఎక్కువ గంటలు సాధన చేస్తున్నానని, షార్ట్‌ బాల్‌, స్లో బంతిని సమర్థంగా ఎదుర్కోవడంపై దృష్టి సారించానని, అదృష్టం కలిసి వచ్చిందని, అయితే షార్ట్‌ బంతిని ఎదుర్కోవడంలో చాలా మెరుగయ్యానని మ్యాచ్ అనంతరం యువరాజ్ చెప్పాడు.

యువీ అర్ధ సెంచరీ, నెహ్రా వంద క్లబ్

యువీ అర్ధ సెంచరీ, నెహ్రా వంద క్లబ్

యువరాజ్‌ సింగ్ హాఫ్ సెంచరీ చేసేందుకు 23 బంతులు ఆడాడు. ఐపీఎల్‌లో అతడికి ఇదే వేగవంతమైన అర్ధసెంచరీ. నెహ్రా ఐపీఎల్‌లో వంద వికెట్లు తీసిన ఆరో బౌలర్ అయ్యాడు. అతడికిది 83వ మ్యాచ్‌.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+