Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డేల్లో మొండి చెయ్యి: 177తో చెలరేగిన యువరాజ్, సెలక్టర్లకు సవాల్

లాహ్లి: న్యూజిలాండ్‌తో ఈనెల 16 నుంచి జరిగే వన్డే సిరిస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా ఆల్ రౌండర్ తనలో బ్యాటింగ్ సత్తా ఇంకా తగ్గలేదని మరోసారి నిరూపించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.

295 బంతుల్లో 24 ఫోర్లతో 177 పరుగులు చేశాడు. 13 మ్యాచ్‌ల తర్వాత రంజీ ట్రోఫీలో యువీ రాణించాడు. రంజీ మ్యాచ్‌లో యువీకి ఇది 25వ సెంచరీ. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు 347 పరుగులు చేసింది.

Yuvraj Singh

యువీతో పాటు గుర్‌కీరత్‌ సింగ్‌ 102 బంతుల్లో సెంచరీ (101 పరుగులు) చేశాడు. వోహ్రా (2), ఉదయ్‌ (6) విఫలమయ్యారు. పంజాబ్‌ 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ వేళ క్రీజు లోకి వచ్చిన యువరాజ్‌ సింగ్ జట్టు స్కోరుని పరిగెత్తించాడు.

ఇక జిశ్వన్‌జోత్‌ సింగ్‌ (61) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మూడో వికెట్‌కు జిశ్వన్‌జోత్‌ సింగ్‌‌తో కలిసి 180 పరుగులు, గురుకీరత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యం యువరాజ్ సింగ్ నెలకొల్పాడు.

కాగా, తొలి మ్యాచ్‌లో పేలవ ఆటతీరుతో నిరాశపరిచిన యువీ ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ బౌలర్లను ఉతికారేశాడు. ఇక మధ్య ప్రదేశ్ బౌలర్లలో ఈశ్వర్‌ 2, గౌరవ్‌ చెరో వికెట్ తీసుకున్నారు. తాజాగా రంజీ మ్యాచ్‌లో యువీ సెంచరీ చేయడంతో సెలెక్టర్లు యువీపై దృష్టి సారించే అవకాశం లేకపోలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+