
వెబ్ సిరీస్‌లో యువీ:
ఇదిలా ఉంటే.. యువరాజ్ సింగ్ త్వరలో ఓ వెబ్ సిరీస్ ద్వారా తెరంగేట్రం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో మంగళవారం వార్తలు చక్కర్లు కొట్టాయి. తన సోదరుడు జొరావర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో యువరాజ్ సతీసమేతంగా కనిపించనున్నాడని, అసోంకు చెందిన డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తుందని వార్తల సారాంశం. ఇక యువీ తల్లి షబ్నమ్ సింగ్ సైతం నిర్మాణంలో భాగస్వామి అని వార్తలు వచ్చాయి.

ఆ వార్తలో నిజం లేదు:
యువరాజ్ సింగ్‌తో పాటు వెబ్ సిరీస్‌లో యూవీ భార్య హాజెల్ కీచ్, తల్లి శబ్నమ్ సింగ్ కూడా ఉన్నట్లు వార్తలు షికారు చేసాయి. ఈ ప్రచారంపై తాజాగా యూవీ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలో ఎంతమాత్రం నిజం లేదంటూ తేల్చి చెప్పేశాడు. 'నేను వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలో నిజం లేదు. వెబ్ సిరీస్‌లో నా సోదరుడు నటిస్తున్నాడు. నేను కాదు. మీడియాలో ఉన్న నా స్నేహితులందరు దిద్దుబాటు చర్యలు చేయాలి. థాంక్స్' అని యూవీ రాసుకొచ్చాడు.

గతేడాది క్రికెట్‌కు వీడ్కోలు:
2019 జూన్‌లో యువరాజ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలవడంతో యువీ కీలక పాత్ర పోషించాడు. 19 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్‌గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా.. ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

304 వన్డేలు.. 8701 పరుగులు
యువీ మొత్తం భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేసాడు. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.


Click it and Unblock the Notifications













