Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనికి అక్తర్‌: యువీని భయపెట్టిన ఫాస్ట్ బౌలర్ ఎవరో తెలుసా?

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 32 బంతుల్లో 53 పరుగులు చేసిన యువీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం లభించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 'ఛారిటీ డిన్నర్' కార్యక్రమానికి భారత జట్టు ఆటగాళ్లు హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఛారిటీ డిన్నర్ కార్యక్రమంలో ధోని, యవరాజ్ సింగ్, రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Yuvraj Singh reveals the toughest bowler he has faced

ఈ కార్యక్రమంలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠిన బౌలర్‌ ఎవరని అడిగిన ప్రశ్నకు యువరాజ్ సింగ్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్‌ ఆస్ట్రేలియా మాజీ పేసర్ మెక్‌గ్రాత్‌ అని యువీ పేర్కొన్నాడు. మెక్ గ్రాత్ భయపెట్టాడని, అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం సవాలేనన్నాడు.

'కెరీర్‌ తొలినాళ్లలో నేను ఎదుర్కొన్న కఠిన బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌. అతడి బౌలింగ్‌ను తప్పించుకోవడం చాలా కష్టం. అతడొక క్రికెట్‌ దిగ్గజం.. ఎదుర్కోవడం చాలా కష్టం' అని యువీ తెలిపాడు. మెక్‌గ్రాత్ ఆఫ్‌ స్టంప్‌ మీదుగా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడని యువీ ప్రశంసలు కురిపించాడు. బంతిని గురితప్పకుండా సంధించడంలో మెక్ గ్రాత్ దిగ్గజమని తెలిపాడు.

ఇదిలా ఉంటే ఇదే వేదికపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తానెదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ గా పాకిస్థాన్ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ పేరును చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు ధోని కారణం కూడా చెప్పాడు. అతను చాలా వేగంగా బంతి విసరుతాడని, దీంతో పాటు యార్కర్, బౌన్సర్ ఏది వేస్తాడో చెప్పలేమని అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+