ఆ సమయంలో రిటైర్ అవుదామనుకున్నా: యువీ సంచలనం
హైదరాబాద్: కటక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ సెంచరీతో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన యువీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇదొకటిగా పేర్కొన్నాడు. అయితే క్యాన్సర్ తర్వాత జాతీయ జట్టులో చోటు కోల్పోవడంతో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నట్లు తెలిపాడు.
క్యాన్సర్ బారిన పడిన యువరాజ్ దానిని ఎదుర్కొనేందుకు సుమారు మూడేళ్ల పాటు ఎంతో శ్రమించాల్సి వచ్చిందని తెలిపాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మొదటి 2-3 సంవత్సరాలు ఎంతో కష్టంగా అనిపించిందని చెప్పాడు. ముఖ్యంగా ఫిట్ నెస్‌పై ఎక్కువ దృష్టి సారించానని అన్నాడు.
అదే సమయంలో జట్టులో కూడా చోటు కోల్పోయానని, పర్మినెంట్‌గా జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమైందని అన్నాడు. ఈ సమయం తన జీవితంలో ఎంతో కష్టంతో కూడుకున్నదని, ఇకపై క్రికెట్‌లో కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయానికి కూడా వచ్చానని చెప్పాడు. ఈ మొత్తం జర్నీలో ఎంతో మంది తనకు సాయపడ్డారని చెప్పుకొచ్చాడు.
ఆశ వదలు కోకూడదనేది తన సిద్ధాంతమని చెప్పిన యువీ ఏదో ఒకరోజు తిరిగి జట్టులో చోటు దక్కించుకుంటాననే నమ్మకం ఉందని చెప్పాడు. ఇక తనపై వచ్చిన విమర్శలను ఎంత మాత్రం పట్టించుకోనని యువీ తేల్చి చెప్పాడు. తాను న్యూస్ పేపర్స్ చదువుతానని, టెలివిజన్ చూస్తానని చెప్పిన యువీ అనవసర విషయాలను పెద్దగా పట్టించుకోనని తెలిపాడు.

తన దృష్టంతా తన ఆట పైనే
తన దృష్టంతా తన ఆట పైనే ఉంటుందని పేర్కొన్నాడు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా తనలో ఉందని, కటక్ వన్డేలో మంచి క్రికెట్ ఆడానని అన్నాడు. రెండో వన్డేలో ధోని, తాను పరిస్థితికి తగ్గట్టు ఆడి ఇన్నింగ్స్ నిర్మించామని చెప్పాడు. కుదురుకున్నాక తరుణం చూసి ఎదురుదాడికి దిగామని యువీ చెప్పాడు.

21 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 150 పరుగులు సాధించిన యువీ
కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో యువరాజ్ సింగ్ 127 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 150 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా 2004లో ఆస్ట్రేలియాపై సాధించిన 139 పరుగుల స్కోరును యువరాజ్ అధిగమించాడు. 2011లో చివరిసారిగా వరల్డ్ కప్‌లో సెంచరీ సాధించిన యువరాజ్ మళ్లీ ఆరేళ్ల తర్వాత సెంచరీని సాధించాడు.

అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన యువీ
యువీతో పాటు మరో వెటరన్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. యువీకి తన సహకారాన్ని అందిస్తూనే ధోని కూడా సెంచరీని పూర్తి చేశాడు. ధోని కూడా 2013లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా సెంచరీ చేశాడు. వీరిద్దరి జోడీ రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్‌పై 15 పరుగుల తేడాతో విజయం
382 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 366 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌పై 15 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను కోహ్లీ సేన 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇయాన్ మోర్గాన్ 102 పరుగులు, జాసన్ రాయ్ 82, రూట్ 54, మొయిన్ అలీ 55 పరుగులతో రాణించినా ఇంగ్లాండ్ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు.

కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సెంచరీ
ఒకవైపు వికెట్లు పడుతున్నా రన్ రేట్‌ను కాపాడుకుండూ బ్యాటింగ్ కొనసాగిచింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. 81 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. 48 ఓవర్ మూడో బంతికి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మోర్గాన్ పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు.

2-0తో వన్డే సిరిస్ కైవసం
మోర్గాన్ ఔట్ తర్వాత మిగిలిన వారు చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 366 పరుగులతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా రెండు, భువనేశ్వర్ కుమార్, జడేజాలు చెరో వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications