Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌కు యువరాజ్ గుడ్‌బై: ట్విట్టర్‌లో ఫ్యాన్స్ ఫేర్‌వేల్ ఇలా! (ట్వీట్స్)

Yuvraj Singh's Retirement Has Left Indian Cricket Fans Teary-Eyed || Oneindia Telugu
Yuvraj Singh Retires From International Cricket, Twitterati Bids Farewell to India’s 2011 Cricket World Cup Hero

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి తన 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ధోని నాయకత్వంలో టీమిండియా సాధించిన రెండు వరల్డ్‌కప్‌ల్లోనూ యువీ కీలకపాత్ర పోషించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారత్ తరుపున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో 304 మ్యాచ్‌లాడి 14 సెంచరీలు, 52 హాఫ్‌ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్‌లాడిన యువీ 8 ఆఫ్‌ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు.

ముఖ్యంగా సొంతగడ్డపై 2011లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శన చేసి 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ప్రాణాంతక క్యాన్సర్‌ ఉందని తెలియడంతో అమెరికా వెళ్లి శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి ఆటకే ప్రాధాన్యత ఇచ్చాడు.

2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువరాజ్ 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు యువీ వీడ్కోలు పలికిన నేపథ్యంలో ట్విట్టర్‌లో అభిమానులు ఇలా...

Story first published: Monday, June 10, 2019, 15:11 [IST]
Other articles published on Jun 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+