క్రికెట్‌కు వీడ్కోలు: క్రికెట్, జీవితంలో యువీ బెస్ట్ సంఘటనలు ఇవే!!

టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ (37 ) సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు యువరాజ్‌సింగ్ ఎనలేని సేవలందించారు. యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం పలువురు అతడి సేవలను గుర్తు చేసుకుంటూ వీడ్కోలు సందేశాలు తెలుపుతున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
యువరాజ్‌సింగ్ టీమిండియా తరఫున 2000లో కెన్యాపై అరంగేట్రం చేసాడు. అనంతరం అంచలంచెలుగా ఎదిగి.. భారత జట్టులో సీనియర్ క్రికెటర్‌గా ఎదిగాడు. సచిన్, లక్ష్మణ్, గుంగూలీ, ద్రవిడ్, కుంబ్లే, జహీర్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఇక 2017లో వెస్టిండీస్‌పై ఆఖరి వన్డే ఆడాడు. ప్రపంచ వ్యాప్తంగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యువీ 22వ స్థానంలో.. టీమిండియా తరఫున ఏడో ఆటగాడిగా నిలిచాడు. అయితే యువీ క్రికెట్, జీవితంలో బెస్ట్ ఐదు సంఘటనలను ఓ సారి పరిశీలిద్దాం.

ఆస్ట్రేలియాపై 84 పరుగులు:
2000 సంవత్సరంలో నైరోబీ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ అది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ మాజీ దిగ్గజ బౌలర్లు మెగ్రాత్, బ్రెట్ లీ, గేలెస్పీల బౌలింగ్ దాటికి భారత బ్యాట్స్‌మన్ తడబడుతుంటే.. యువరాజ్ సింగ్ 12 ఫోర్లతో 84 పరుగులు చేసాడు. దీంతో భారత్ 260 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌తోనే యువీ సత్తా ప్రపంచానికి తెలిసింది.

ఇంగ్లాండ్‌పై 69 పరుగులు:
2002 లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. అప్పట్లో 325 పరుగులు అంటే ఛేదించడం చాలా కష్టం. గుంగూలీ, సెహ్వాగ్ మంచి ఆరంభం ఇచ్చినా.. మధ్యలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. కైఫ్ సహాయంతో యువీ 63 బంతుల్లో 69 పరుగులు చేయడంతో.. ఇంకా 3 బంతులు ఉండగానే టీమిండియాను విజయం వరించింది. ఈ మ్యాచ్‌లో యువీ పోరాట పటిమ తెలిసింది.

6 బంతుల్లో 6 సిక్సర్లు:
2007 తొలి టీ20 ప్రపంచకప్. యువీ ఊతకోచకు బలైంది ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్. మ్యాచ్‌లో అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ వాగ్వాదానికి దిగడంతో అతినిపై ఉన్న ఆగ్రహానికి బ్రాడ్ బలయ్యాడు. బ్రాడ్ వేసిన ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది యువీ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచులో యువీ కేవలం 12 బంతుల్లోనే ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ చేసాడు. ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.

2011 ప్రపంచకప్:
2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ప్రదర్శన అద్భుతం. 28 ఏళ్ల తర్వాత భారత్ రెండోసారి ప్రపంచకప్ అందుకోవడంలో యువరాజ్ సింగ్‌దే కీలక పాత్ర. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సహచరులంతా వెనుదిరుగుతున్నా.. నిలకడగా ఆడుతూ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 90.50 యావరేజితో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు' అందుకున్నాడు.

క్యాన్సర్‌ను జయించి:
2011 వరల్డ్‌కప్ అనంతరం యువరాజ్ కెరీర్ ప్రశ్నర్ధకంగా మారింది. ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. చివరకు అమెరికాలో చికిత్స తీసుకుని బయటపడ్డాడు. అనంతరం పునరాగమనం చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై ఆడిన ఇన్నింగ్స్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో యువీ 21 బంతుల్లో 11 పరుగులే చేయడం అతడి సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. మరోవైపు జట్టులో యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అవకాశం వచ్చినా.. యువీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications