Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువీ రిటైర్మెంట్ పార్టీలో సందడి చేసిన ధావన్, కైఫ్, సానియా మిర్జా

Yuvraj Singh retirement bash: Shikhar Dhawan, Mohammad Kaif, Sania Mirza in attendance

హైదరాబాద్: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్ సింగ్ శనివారం ముంబైలో తన రిటైర్మెంట్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ రిటైర్మెంట్ పార్టీకి అటు బాలీవుడ్‌తో పాటు పాటు ఇటు క్రీడా రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జూన్ 10న ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి మరీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ అనంతరం యువరాజ్ గత శనివారం పార్టీ ఇచ్చాడు.

ఈ పార్టీకి టీమిండియా క్రికెటర్లు శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ తదితరులు హాజరయ్యారు. గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమైన దూరమైన శిఖర్ ధావన్ కూడా ఈ పార్టీలో సందడి చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ తన కుటుంబంతో కలిసి ఈ పార్టీకి హాజరయ్యాడు.

నీతా అంబానీ సైతం

నీతా అంబానీ సైతం

రిలయన్స్ ఫౌండేషన్ నీతా అంబానీతో పాటు భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బాలీవుడ్ నుంచి ఫర్హాన్ అక్తర్, రవీనా టాండన్, సాగరిక ఘట్కే తదితరులు హాజరయ్యారు. ఈ పార్టీకి హాజరైన వారంతగా చాలా సరదాగా సందడి చేశారు. భారత్ తరుపున మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువీ 1900 పరుగులు చేశాడు.

304 మ్యాచ్‌లాడిన యువీ

304 మ్యాచ్‌లాడిన యువీ

ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల్లో 304 మ్యాచ్‌లాడి 14 సెంచరీలు, 52 హాఫ్‌ సెంచరీలతో 8701 పరుగులు చేశాడు. 58 టీ20 మ్యాచ్‌లాడిన యువీ 8 ఆఫ్‌ సెంచరీలతో 1177 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాడు.

మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా

మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా

కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్‌గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా, ఆల్‌రౌండర్‌గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువరాజ్ 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు తనకు అనుమతి ఇవ్వాలని యువరాజ్ బీసీసీఐని కోరాడు.

గ్లోబ‌ల్ టీ20 కెన‌డా టోర్న‌మెంట్‌లో

గ్లోబ‌ల్ టీ20 కెన‌డా టోర్న‌మెంట్‌లో

ఇందులో భాగంగా కెన‌డా వేదిక‌గా త్వ‌ర‌లో ఆరంభం కాబోతున్న గ్లోబ‌ల్ టీ20 కెన‌డా టోర్న‌మెంట్‌లో యువ‌రాజ్ సింగ్ ఆడ‌బోతున్నాడు. టోరంటో నేష‌న‌ల్స్ జ‌ట్టుకు అత‌ను ఎంపిక అయ్యాడు. జులై 25వ తేదీ నుంచి ఈ టోర్న‌మెంట్ ఆరంభం కానుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ త‌ర‌హాలోనే క్రికెట్‌ను ప్రోత్స‌హించ‌డానికి గ్లోబ‌ల్ టీ20 కెన‌డాను నిర్వ‌హిస్తున్నారు.

టోరంటో నేష‌న‌ల్స్ త‌ర‌ఫున

టోరంటో నేష‌న‌ల్స్ త‌ర‌ఫున

ఈ టోర్న‌మెంట్‌లో టోరంటో నేష‌న‌ల్స్ త‌ర‌ఫున ఆల్‌రౌండ‌ర్ కేట‌గిరీలో యువ‌రాజ్ సింగ్‌ను తీసుకుంది జ‌ట్టు మేనేజ్‌మెంట్‌. దీంతో పాటు మ‌రో టీ20 టోర్న‌మెంట్‌కు కూడా యువ‌రాజ్ సింగ్ ఎంపిక అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. యూరో టీ20 స్లామ్ టోర్న‌మెంట్‌లో కూడా యువ‌రాజ్ ఆడ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది

Story first published: Thursday, July 4, 2019, 15:47 [IST]
Other articles published on Jul 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+