న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ విజయం కోసం ప్రాణం పెట్టి ఆడాం: యువరాజ్ సింగ్

Yuvraj Singh reminds Nasser Hussain of India’s Natwest Trophy triumph

న్యూఢిల్లీ: గెలుస్తామని ఆశ లేకపోయినా.. విజయమే లక్ష్యంగా 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో టీమ్ మొత్తం ప్రాణం పెట్టి ఆడిందని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. సీనియర్లు విఫలమైనా..తమకు అనుభవం లేకపోయినా.. విజయం కోసమే తాము పోరాడామన్నాడు. కుర్రాళ్ల విలువ పెంచిన ఆ పోరాటమే టీమిండియా బలమైన భవిష్యత్తుకు పునాదులు వేసిందన్నాడు. సోమవారం ఈ అద్భుత విజయానికి 18 ఏళ్లు నిండటంతో నాటి క్షణాలను యూవీతో పాటు కైఫ్ స్మరించుకున్నాడు.

లవ్లీ ఫొటోలు మిత్రమా..

లవ్లీ ఫొటోలు మిత్రమా..

ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్‌ నాటి మధుర స్మృతులను ట్విటర్ వేదికగా తలచుకున్నాడు. ‘నాట్‌వెస్ట్‌ ట్రోఫీ కోసం ప్రాణం పెట్టి ఆడాం. మేమప్పటికి యువ ఆటగాళ్లం. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సమష్టి కృషితో గెలవగలిగాం'అని యువీ ట్వీట్ చేశాడు. మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసి అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్‌ను ట్యాగ్ చేశాడు. ‘ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటే..'అని హుస్సేన్‌ను ఉద్దేశించి రాసుకొచ్చాడు. దీనికి నాజర్ కూడా హుందాగా స్పందించాడు. ‘కొన్ని లవ్లీ ఫొటోలు మిత్రమా.. షేర్ చేసినందుకు థ్యాంక్స్'అంటూ బదులిచ్చాడు.

అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అయ్యా..

అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అయ్యా..

ఫైనల్ మ్యాచ్‌ విజయం సాధించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని మహ్మద్ కైఫ్ తెలిపాడు. ఆ మ్యాచ్‌ జరిగి 18 ఏళ్లు గడిచినా తనకు ఇప్పటికీ అదో ప్రత్యేకమైన మ్యాచ్ అని వివరించాడు. 'ఫైనల్ మ్యాచ్ తర్వాత భారత క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చొక్కా విప్పి వేడుక చేసుకున్న గంగూలీ కెప్టెన్సీని అందరూ మెచ్చుకున్నారు. అంతేకాకుండా భారత్ కూడా భారీ స్కోర్లను ఛేజ్ చేయగలదన్న నమ్మకం అభిమానులకు కలిగించింది. ముఖ్యంగా 1983 తర్వాత లార్డ్స్ ‌మైదానంలో భారత్ గెలిచిన రెండో మ్యాచ్ అదే కావడం విశేషం. దీంతో భారత కీర్తి ఎంతో పెరిగింది. మ్యాచ్ అనంతరం నేను తిరిగివచ్చేసరికి మా ఊరు అలహాబాద్‌లో ఎక్కడ చూసినా వేడుకలే. నన్ను ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ఒక్కసారిగా ఎంతో గర్వం కలిగింది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌లా ఫీల్ అయ్యాను. ఆ మ్యాచ్ తరువాత అందరూ నన్ను ఫాలో అవడం మొదలెట్టారు' అని తెలిపాడు.

యువీ-కైఫ్ జోడీ..

యువీ-కైఫ్ జోడీ..

నాటి ఫైనల్లో 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు ఓ దశలో 146/5 స్కోరుతో విజయం ఇక అసాధ్యం.. అనే స్థితిలోకి వెళ్లింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యువరాజ్‌-మహ్మద్‌ కైఫ్‌ జోడీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మరో మూడు బంతులుండగానే జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. రాహుల్ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్, నయన్ మోంగియా విఫలమైన వేళ..యువీ(69), కైఫ్(87 నాటౌట్) జోడీ ఆరో వికెట్ 121 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది. అయితే యువీ ఔటైనా.. కైఫ్ టెయిలండర్ల సాయంతో 59 పరుగులు జోడించి అద్భుత విజయాన్నందుకున్నాడు. కైఫ్‌కు జహీర్ ఖాన్ చక్కని సహకారం అందించాడు

దాదా షర్ట్ విప్పేశాడు..

దాదా షర్ట్ విప్పేశాడు..

అంతకుముందు వరుసగా జరిగిన తొమ్మిది ఫైనల్స్‌లో భారత్ ఓడటంతో.. కెప్టెన్‌గా గంగూలీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీనికి తోడు ఇండియా టూర్‌కు వచ్చిన ఇంగ్లండ్ సిరీస్ గెలవడంతో.. ఫ్లింటాఫ్ షర్ట్ విప్పేసి వాంఖడే మొత్తం పరుగులు పెట్టాడు. దీంతో దాదాలో ఆత్మ గౌరవ పోరాటం మొదలైంది. బయటకు కనిపించికపోయినా.. చాలా రోజులుగా ఈ విషయంలో నలిగిపోయిన దాదా.. కైఫ్ విన్నింగ్ షాట్ కొట్టగానే లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పి గిరిగిరా గాల్లోకి తిప్పుతూ తన కసి చూపెట్టాడు.

వాళ్లవన్నీ ఉత్తమాటలే.. కెప్టెన్సీ ఎంజాయ్ చేశా: బెన్ స్టోక్స్

Story first published: Tuesday, July 14, 2020, 11:20 [IST]
Other articles published on Jul 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X