ఎవడ్రా ఈ పిచ్చోడు: దినేశ్ కార్తీక్‌ను తిట్టిన దాదా, అసలేం జరిగిందో చెప్పిన యువరాజ్!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ల మధ్య చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటనపై యువరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. వివరాల్లోకి వెళితే... భారత జట్టులోకి వచ్చిన కొత్తలో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌పై అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశాడంట.
ఈ విషయాన్ని తాజాగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మతో కలిసి 'బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్' అనే చాట్‌షోలో పాల్గొన్న దినేశ్ కార్తీక్ స్వయంగా వివరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా 2004, సెప్టెంబరు 19న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే
ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. భారత్-పాక్ మ్యాచ్ అంటే చాలు ఎంతటి భావోద్వేగ పరిస్థితులు ఉంటాయో. అయితే, ఈ మ్యాచ్‌లో వికెట్ పడగానే సబ్‌స్టిట్యూట్‌గా ఉన్న దినేశ్ కార్తీక్ నీళ్ల బాటిళ్లు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే, కంగారులో దినేశ్ కార్తీక్ దాదా వీపు వెనుక భాగానికి తగిలాడు.
కోపంతో దినేశ్ కార్తీక్‌ను తిట్టిన దాదా
దీంతో కోపంతో ఊగిపోయిన సౌరవ్ గంగూలీ "ఇలాంటి ఆటగాళ్లను ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఎవరితను?" అని కోపంతో గట్టిగా తిట్టాడని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. అయితే అసలు ఆ సమయంలో సౌరవ్ గంగూలీ సరిగ్గా ఏం అన్నాడో ఆ మ్యాచ్‌లో ఆడిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ట్విటర్ వేదికగా స్పందించాడు.
ఎవడ్రా ఈ పిచ్చోడు
యువరాజ్ సింగ్ తన ట్విట్టర్‌లో "ఎవడ్రా ఈ పిచ్చోడు. భారత్, పాక్ ఉత్కంఠ మ్యాచ్ మధ్యలో ఇలాంటి వాడిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఇవీ దాదా మాట్లాడిన మాటలు" అంటూ చాట్ షోలో పాల్గొన్న దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మకు ట్యాగ్ చేస్తూ యువరాజ్ సింగ్ ట్వీట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీమిండియాపై పాకిస్థాన్ విజయం
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మరో 4 బంతులు మిగిలుండగా టీమిండియాపై పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ తుది జట్టులో ఒకడిగా ఉన్న యువరాజ్ సింగ్ దినేశ్ కార్తీక్ ఇంటర్యూని చూసి ట్విట్టర్‌లో స్పందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications