ముంబై: యువరాజ్ సింగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆట పట్టించిన వాళ్ల జాబితాలో సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ సహా చాలామంది సీనియర్లు ఉన్నారు. ఐపీఎల్ 10 సందర్భంగా హైదరాబాద్ చేరుకొన్న యువీ తన సన్‌రైజర్స్ సహచరుడు శిఖర్ ధావన్‌ను శనివారం ఏప్రిల్ ఫూల్ చేశాడు.
బస చేసిన హోటల్ నీటి కొలనులో ధావన్ ఈత కొడుతుండగా అతడి భార్య అత్యవసరంగా తనకు కాల్ చేసిందని యువరాజ్ చెప్పాడు. దీంతో గబుక్కున పైకి వచ్చి బ్యాగ్‌లో మొబైల్ వెతికాడు శిఖర్.
ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో నవ్వులు విరబూశాయి. ఈ సరదా సంఘటన తాలూకా వీడియోను యువీ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఐపీఎల్ 10 ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రన్నరప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.