న్యూఢిల్లీ: తాను టీమిండియాకు ఆడినప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ తనపై చాలా సార్లు నోరు పారేసుకున్నాడని భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ పెషావర్ జట్టుకు మద్దతుగా యువీ ఓ వీడియో షో నిర్వహించాడు.
షాహిద్ ఆఫ్రిదీ సోదరుడు ఆ జట్టు యజమాని. షాహిద్ ఆఫ్రిదీ ఉండడం వల్లనే తాను ఆ జట్టుకు మద్దతు ఇస్తున్నానని యువీ అన్నాడు. ఆఫ్రిదీ బాదే సిక్శ్‌లు అద్భుతంగా ఉంటాయని, ఓసారి ఇటూ ఓసారి ఓటూ సిక్స్‌లు బాదుతాడని ఆయన అన్నాడు.

నోరు పారేసుకోవడం ఆఫ్రిదీకి అలవాటు అని, అయితే అతనికి మంచి మనసు ఉందని ఆయన అన్నాడు. చాలా షాహిద్ దూషణలకు దిగాడని, కానీ తాను వాటిని పట్టించుకోలేదని అన్నాడు. పాకిస్తాన్, భారత్ మధ్య క్రికెట్ సిరీస్ సందేహంలో పడిన నేపథ్యంలో యువీ, షాహిద్ క్రికెటర్లు ఆ దాన్ని కాస్తా చల్లబరిచారు.
అఫ్రిదీ దూషణలను తీవ్రంగా తీసుకోవద్దని, ఆఫ్రిదీ బయటకు చాలా కఠినంగా కనిపిస్తాడు గానీ లోపల చాలా మెత్తని మనిషి అని యువీ అన్నాడు. షాహిద్ అఫ్రిదీ ఉన్న జట్టు తప్పకుండా బాగా ఆడుతుందని ఆయన అన్నాడు. యువరాజ్ స్నేహపూర్వకరమైన వ్యాఖ్యలకు షోసల్ మీడియాలో, ప్రత్యేకంగా పాకిస్తాన్ అభిమానుల నుంచి ఎనలేని ప్రశంసలు వచ్చాయి.