Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, రాహుల్ ట్వీట్‌పై చురక అంటించిన యువరాజ్

హైదరాబాద్: గాలే వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల టెస్టు నాలుగు రోజులకే ముగియడంతో గెలుపు అనంతరం టీమిండియా ఆటగాళ్లు స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతూ కనిపించారు.

దీనికి సంబంధించిన ఫోటోలను కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. స్విమ్మింగ్‌ పూల్‌లో కెప్టెన్ కోహ్లీతో దిగిన ఫొటోని కేఎల్ రాహుల్‌ కూడా తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. 'సెల్ఫీ దిగుదామని కెప్టెన్ కోరాడు. గాలేలోని ఓ బీచ్‌లో కోహ్లీతో సరదాగా' అని ఆ ఫొటో కింద రాహుల్‌ కామెంట్ పెట్టాడు.

Yuvraj Singh pokes fun at KL Rahul, Virat Kohli with a hilarious tweet

కేఎల్‌ రాహుల్‌ చేసిన ఓ ఈ ట్వీట్‌‌పై వెటరన్ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ తనదైన శైలిలో స్పందించాడు. 'నువ్వు అసలు ఏం చెప్పదలుచుకున్నావు. విరాట్‌ కోహ్లీ సెల్ఫీ అడగడంతో మరో అవకాశం లేక అతనితో పోజిచ్చావు. కెప్టెన్ చెప్పిన మాట వింటున్నావని మాకు అర్థమైంది' అని పేర్కొన్నాడు.

యువరాజ్ ట్వీట్‌కు రాహుల్ కూడా తనదైన శైలిలోనే స్పందించాడు. 'అదీ నిజమే. కానీ, నేను ఎవరితో సెల్ఫీ దిగడానికైనా సిద్ధమే' అని రాహుల్ సమాధానమిచ్చాడు. ఇదిలా ఉంటే గాలే వేదికగా జరిగిన తొలి టెస్టుకు జ్వరం కారణంగా కేఎల్‌ రాహుల్‌ తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

పూర్తిగా కోలుకున్న రాహుల్‌ రెండో టెస్టు కోసం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్‌ష శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 3న కొలంబో వేదికగా ప్రారంభం కానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+