Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ, కోహ్లి కాదు.. అతనే అత్యుత్తమ ప్లేయర్: యువరాజ్ సింగ్

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్లేయర్ ఎవరనే దాని గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే ప్రస్తుత టెస్టుల్లో ఉత్తమ ఆటగాడు, ఓవరాల్‌గా బెస్ట్ ప్లేయర్ గురించి యువీ తన ఎనాలసిస్ చెప్పాడు. ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యువరాజ్ క్రికెట్‌తో పాటు తన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నాడు.

తాను ఓ హీరోయిన్‌తో డేటింగ్ చేశానని యువరాజ్ సింగ్ తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు ఆ నటితో జరిగిన సంఘటన గురించి సిక్సర్లు వీరుడు వివరించాడు. తన సూట్‌కేసు ప్యాక్ చేయడంతో ఆ హీరోయిన్ పింక్ స్లిప్పర్స్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2007/08 కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన దాని గురించి మాట్లాడాడు.

Yuvraj Singh Picks Rohit Sharma Over Kohli and Dhoni for T20s Outstanding Captain and Game-Changer with the Bat

పోడ్‌కాస్ట్‌లో యాంకర్.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలలో ఒకరిని ఎంచుకోవాలని యువరాజ్‌ను అడిగాడు. దానికి రోహిత్‌ను యువీ సెలక్ట్ ఎంచుకున్నాడు. దానికి ఇలా వివరణ కూడా ఇచ్చాడు. ''టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మనే ఎంచుకుంటాను. అతను ఓ అద్భుతమైన కెప్టెన్. అంతేగాక తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. హిట్‌మ్యాన్ నా మొదటి ఛాయిస్'' అని యువరాజ్ అన్నాడు.

ప్రస్తుత అత్యుత్తమ టెస్టు ప్లేయర్ జో రూట్ అని యువీ పేర్కొన్నాడు. అయితే ఓవరాల్‌గా అత్యుత్తమ బ్యాటర్‌గా విరాట్ కోహ్లి అని అన్నాడు. ''ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో జో రూట్ అత్యుత్తమ బ్యాటర్. అయితే ఓవరాల్‌గా క్రికెట్‌లో బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లి'' అని యువీ పేర్కొన్నాడు. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేత గురించి సిక్సర్ల వీరుడు జోస్యం చెప్పాడు. అయిదు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-2తో విజయం సాధిస్తుందని యువీ చెప్పాడు.

Story first published: Thursday, September 26, 2024, 14:27 [IST]
Other articles published on Sep 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+