Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సముద్రం మధ్యలో యువీ రచ్చ: అందాల భామలతో ఏందయ్యా ఇది!

క్రీడా ప్రపంచంలో సిక్సర్ల కింగ్‌గా పేరొందిన యువరాజ్ సింగ్.. రిటైర్మెంట్ తర్వాత కూడా వార్తల్లో నిలుస్తున్నారు. మైదానంలో దూకుడుగా ఉండే యువరాజ్ సింగ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నాడు. తన 'యువీక్యాన్' (YouWeCan) స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక సేవ చేస్తూనే.. గ్లామర్ ప్రపంచంలోనూ అడుగులు వేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో యువరాజ్ సింగ్ కెనడాకు చెందిన విదేశీ మోడల్‌‌తో కలిసి దిగిన ఫోటోషూట్ సంచలనం సృష్టిస్తోంది. సముద్రం మధ్యలో తీసిన ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

బీచ్ వేర్‌లో యువీ
బీచ్ వాతావరణంలో, సముద్రపు ఒడ్డున బీచ్ వేర్‌లో యువరాజ్ సింగ్ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. ఈ ఫోటోషూట్‌లో పలువురు అంతర్జాతీయ మహిళా మోడల్స్ పాల్గొనగా.. వారిలో ఒక 'ప్రత్యేక' మహిళా మోడల్‌తో యువీ దిగిన ఫోటోలు నెటిజన్ల దృష్టిని పూర్తిగా ఆకర్షించాయి.

Yuvraj Singh Photoshoot with Hot Tennis Player and Model Annalia Fraser

ఎవరీ అనాలియా ఫ్రేజర్?
యువరాజ్ సింగ్‌తో ఉన్న ఆ 'ప్రత్యేక' మహిళా మోడల్ పేరు అనాలియా ఫ్రేజర్. అనాలియా కేవలం మోడల్ మాత్రమే కాదు, కెనడాకు చెందిన ఓ టెన్నిస్ క్రీడాకారిణి కూడా. అనాలియా ఫ్రేజర్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తాను మోడల్, నటి, టెన్నిస్ ప్లేయర్ అని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తరచుగా ఆకర్షణీయమైన మోడలింగ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఆమెకు ప్రస్తుతం 45 వేలకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఈ ఫోటోషూట్ కారణంగా ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

వ్యాపార ప్రకటన కోసమే ఈ ఫోటోషూట్
యువరాజ్ సింగ్, అనాలియా ఫ్రేజర్ కలిసి కనిపించిన ఈ ఫోటోలు ఏ వ్యక్తిగత బంధానికి సంబంధించినవి కావు. అవి 'ఫైనో టెకీలా' అనే అంతర్జాతీయ కంపెనీ యాడ్ క్యాంపెయిన్‌లో భాగం. యువరాజ్ సింగ్ ఈ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉన్నారు.

హర్భజన్ సింగ్ ఫన్నీ కామెంట్
యువరాజ్ ఫోటోషూట్‌ను చూసిన ఆయన చిరకాల మిత్రుడు, భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించిన తీరు నవ్వులు పూయించింది. తన స్నేహితుడిని ఆటపట్టిస్తూ హర్భజన్ ఇలా కామెంట్ చేశారు. "పాజీ ఇంటికి పోవాలా వద్దా! ఇంత మంది మహిళలను కూడబెట్టారు. మంచి మనిషిగా మారిపోండి." అంటూ భజ్జీ సరదాగా యువరాజ్‌ను ఆటపట్టించారు. భార్య హేజల్ కీచ్ ఉన్నా కూడా యువరాజ్ ఇలా మోడల్స్‌తో ఫోటోలు దిగడంపై హర్భజన్ వేసిన ఈ సెటైర్ నెటిజన్లను మరింత ఆకర్షించింది.

Story first published: Tuesday, December 9, 2025, 13:29 [IST]
Other articles published on Dec 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+