Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటో బాంబ్: యువీ, హాజెల్ కీచ్‌తో సాగరిక సెల్ఫీ, ఫోటో వైరల్

Yuvraj Singh photobombs Hazel Keech, Sagarika Ghatge’s selfie, image goes viral on social media

హైదరాబాద్: టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన సహచర క్రికెటర్లు జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్, ఆశిష్ నెహ్రాలతో కలిసి ప్రస్తుతం హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా అతని భార్య సాగరిక.. మాల్దీవుల్లో పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేసింది.

ఈ పార్టీకి యువరాజ్ సింగ్ తన భార్య హేజిల్ కీచ్‌తో హాజరవగా.. ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఈ హాలీడే ట్రిప్‌లో భాగంగా యువరాజ్, హాజెల్‌తో కలిసి తాను తీసుకున్న ఓ సెల్ఫీని సాగరిక తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫేలవ ఫామ్, ఫిట్‌నెస్‌లేమి కారణంగా టీమిండియాకు యువరాజ్ సింగ్ దూరమవగా.. ఇప్పటికే జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రాలు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ సినిమాల్లో నటించిన హాజేల్ కీచ్, సాగరికలను యువీ, జహీర్ ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. జహీర్ ఖాన్ 40వ పుట్టినరోజు సందర్భగా సాగరిక ఈ పార్టీని ఏర్పాటు చేసింది.

Story first published: Monday, October 15, 2018, 16:27 [IST]
Other articles published on Oct 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+