మరిన్ని సిక్సర్లు కొడతావా?: ధోనిని అడిగిన యువరాజ్
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని 197 సిక్సులు బాదాడు. ఇటీవలే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ధోని బ్యాట్ నుంచి మరిన్ని సిక్సులు వచ్చే అవకాశం ఉందని తనంతట తానే ధోని ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఇంగ్లాండ్‌తో ఇండియా ఏ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ భుజంపై చేయి వేసి యువీ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ సందర్భంగా పదేళ్ల ధోనీ కెప్టెన్సీపై ఇద్దరూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఈ వీడియోలో చివర్లో ఇక ఇప్పటి నుంచి ఎన్ని సిక్సర్లు బాదుతావ్ అని సరదాగా యువీ అడిగిన ప్రశ్నకు ధోనీ సమాధానమిచ్చాడు.
బంతి తన బౌలింగ్ ఎరీనాలోకి వచ్చి అన్ని అనుకూలిస్తే ఎక్కువ సిక్సర్లు బాదునని ధోని బదులిచ్చాడు. కెప్టెన్సీ భారం దిగిపోయింది ఇక సిక్సులు కొట్టే పాత ధోనీని మళ్లీ చూపించాల్సిన సమయం వచ్చింది అని యువరాజ్ సింగ్ చెప్పడంతో సిక్సుల ప్రస్తావన మళ్లీ వచ్చింది. 283 వన్డే మ్యాచ్‌లాడిన ధోని 200 సిక్సులు మార్కుని చేరుకునేందుకు ఇక 3 సిక్సుల దూరంలో ఉన్నాడు.
351 సిక్సులతో ఆల్ టైమ్ సిక్సు హిట్టర్స్ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ మొట్టమొదటి స్ధానంలో ఉన్నాడు. 197 సిక్సులతో మహేంద్ర సింగ్ ధోని ఐదో స్ధానంలో నిలిచాడు. ధోని 200 సిక్సులను బాదితే న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ రికార్డుని సమం చేస్తాడు.
వన్డేల్లో ఎక్కువ సిక్సులు సాధించిన క్రికెటర్లు (Top 6)
351 - షాహిది అఫ్రిదీ (పాకిస్థాన్)
270 - సనత్ జయసూర్య (శ్రీలంక)
238 - క్రిస్ గేల్ (వెస్టిండిస్)
200 - బ్రెండన్ మెక్ కల్లమ్ (న్యూజిలాండ్)
197 - మహేంద్ర సింగ్ ధోని (ఇండియా)
195 - సచిన్ టెండూల్కర్ (ఇండియా)

ఇంగ్లాండ్ సిరిస్‌కు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్‌గా
35 ఏళ్ల ధోని త్వరలో ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌కు వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్‌గా ఎంపికయ్యాడు. జనవరి 15న పూణెలో జరగనున్న తొలి వన్డేలో ధోని యాక్షన్‌లోకి దిగనున్నాడు. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ కెప్టెన్‌గా ధోనికి ఆఖరి మ్యాచ్.

సోషల్ మీడియాలో వైరల్ అయిన యువీ, ధోనిలు సరదా వీడియో
ఈ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిలు సరదాగా మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో యువరాజ్ సింగ్ ఎంతో అప్యాయంగా ధోని భుజాలపై చేతులు వేసి మరీ అతడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు.

కెప్టెన్‌గా ప్రయాణం చాలా బాగుంది
టీమిండియాలో కెప్టెన్‌గా ప్రస్ధానం గురించి ధోనిని యువరాజ్ సింగ్ ప్రశ్నించాడు. ‘టీమిండియా కెప్టెన్‌గా ప్రయాణం చాలా బాగుంది. నీలాంటి ఆటగాళ్లు ఉండడంతో జట్టు సారథ్య బాధ్యతలు నాకు భారంగా అనిపించలేదు. పదేళ్లు సారథ్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాను. ఏదైతే అనుభూతిని పొందుతున్నానో దానిని చక్కగా ఎంజాయ్ చేశా' అని సమాధానం చెప్పాడు.

అందరి కంటే నువ్వే ఉత్తమ కెప్టెన్
ఆ తర్వాత యువీ మాట్లాడుతూ ‘అందరి కంటే నువ్వే ఉత్తమ కెప్టెన్. నీ నాయకత్వంలో ఆడడం చాలా అద్భుతంగా అనిపించింది. మూడు మేజర్ టోర్నమెంట్లు, ప్రపంచకప్ గెలవడంతో పాటు టెస్టుల్లో టీమిండియాను నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత నీదే' అని ధోనిపై ప్రశంసలు కురిపించాడు.

ఆరు సిక్సర్లు కొట్టడం మర్చిపోలేను
మధ్యలో ధోని జోక్యం చేసుకుని ‘నువ్వు ఆరు సిక్సర్లు కొట్టడం మర్చిపోలేను' అని అన్నాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ధోనికి యువీ థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత యువరాజ్ ఏమైనా అడగడం మర్చిపోయానా? అని అన్నాడు. దీనికి ధోని ఇక ఏమీ అడగొద్దన్నాడు. ధోనీపై ఉన్న కెప్టెన్సీ భారం పోవడంతో ఇక తామిద్దరం స్వేచ్ఛగా ఆడతామని యువీ ఈ మ్యాచ్‌కు ముందే చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications