Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విదేశీ టీ20ల్లో ఆడేందుకు యువరాజ్‌ సింగ్‌కు లైన్ క్లియర్?

Yuvraj Singh Likely To Get BCCI Approval For Participation In Foreign T20 Leagues || Oneindia Telugu
Yuvraj Singh Likely to Get BCCI Approval for Participation in ICC approved Foreign T20 Leagues

తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన యువరాజ్‌ సింగ్‌ విదేశీ టీ20 లీగుల్లో క్రికెట్‌ ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే యువరాజ్‌ బీసీసీఐ బోర్డును అనుమతి కోరుతూ ఇంకా లేఖ రాయలేదు. లేఖ రాసిన వెంటనే బీసీసీఐ అనుమతి ఇవ్వనుందని బోర్డులోని ఓ అధికారి తెలిపారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అనుమతి ఇస్తాం:

అనుమతి ఇస్తాం:

'విదేశీ టీ20 లీగ్ విషయమై యువరాజ్‌ బోర్డును అనుమతి కోరుతూ ఇంకా లేఖ రాయలేదు. లేఖ అందిన వెంటనే దానిని పరిశీలిస్తాం. యువీ ఐపీఎల్‌ ఆడటం లేదు కాబట్టి విదేశీ లీగుల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించేందుకు అవకాశాలు తక్కువ. యువీ లాంటి మాజీ క్రికెటర్లు విదేశాల్లో ఆడేందుకు అనుమతి ఇస్తాం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

సమస్యేమీ లేదు:

సమస్యేమీ లేదు:

'రిటైర్మెంట్‌ తర్వాత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ విదేశీ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు.. యువరాజ్‌ కూడా ఆడతానంటే సమస్యేమీ లేదు. యువీ ఇప్పుడు రిటైర్‌ అయ్యాడు. అతను 2007, 2001 ప్రపంచకప్‌లలో అద్భుత ప్రదర్శన చేసాడు. భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేశాడు. అతనికెప్పుడూ గౌరవం ఉంటుంది' అని మరో అధికారి పేర్కొన్నారు.

 విదేశీ టీ20ల్లో:

విదేశీ టీ20ల్లో:

రిటైర్మెంట్‌ అనంతరం చాలా మంది భారత ఆటగాళ్లు విదేశీ టీ20ల్లో ఆడుతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌, జహీర్‌ ఖాన్ టీ10 క్రికెట్‌ ఆడుతున్నారు. తాజాగా ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా విదేశీ క్రికెట్‌ ఆడేందుకు బీసీసీఐ అనుమతి కోరాడు. అయితే బోర్డు పరిధిలో క్రికెట్‌ ఆడుతున్న వారికి బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు. యువరాజ్‌ సింగ్‌కు బీసీసీఐ అనుమతి ఇస్తే.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్‌, ఐర్లండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడు.

2017లో చివరి వన్డే, టీ20:

2017లో చివరి వన్డే, టీ20:

భారత స్టార్ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ (37) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. దీంతో పాటు దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికాడు. బీసీసీఐతో చర్చలు జరిపిన అనంతరం సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి యువరాజ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువీ.. 2017లో చివరి వన్డే, టీ20 ఆడాడు.

304 వన్డేలు.. 8701 పరుగులు

304 వన్డేలు.. 8701 పరుగులు

యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Tuesday, June 11, 2019, 9:39 [IST]
Other articles published on Jun 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+