Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూవీ క‌నిపించ‌డ‌నే ఆవేద‌న వ‌ల‌దిక‌! మ‌రో టీ20 టోర్నీకి ఎంపిక!

Yuvraj Singh likely to feature in Euro T20 Slam

న్యూఢిల్లీ: క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన త‌రువాత యువ‌రాజ్ సింగ్‌కు ఒక్క‌సారిగా ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు వ‌చ్చి ప‌డుతున్నాయి. అంత‌ర్జాతీయ‌, దేశ‌వాళీ క్రికెట్ నుంచి కొద్దిరోజుల కింద‌టే రిటైర్‌మెంట్‌ను ప్ర‌క‌టించాడు యువ‌రాజ్ సింగ్‌. యువ‌రాజ్ సింగ్ వంటి ఆల్‌రౌండ‌ర్ త‌క్కువ కాలంలో క్రికెట్ నుంచి వైదొల‌గ‌డం ప‌ట్ల అభిమానులు ఆవేద‌నకు గుర‌య్యారు. త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని కోరుతూ ట్వీట్ల ద్వారా సందేశాల‌నూ పంపించారు. ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ మెరుపులు ఇక క్రికెట్‌లో చూడ‌లేమ‌నుకునే అభిమానుల‌కు ఊర‌ట క‌లిగిస్తున్నాడు యువ‌రాజ్ సింగ్‌. వ‌రుస‌గా టీ20 టోర్న‌మెంట్ల‌లో క‌నిపించ‌బోతున్నాడు.

కెన‌డా వేదిక‌గా త్వ‌ర‌లో ఆరంభం కాబోతున్న గ్లోబ‌ల్ టీ20 కెన‌డా టోర్న‌మెంట్‌లో యువ‌రాజ్ సింగ్ ఆడ‌బోతున్నాడు. టోరంటో నేష‌న‌ల్స్ జ‌ట్టుకు అత‌ను ఎంపిక అయ్యాడు. జులై 25వ తేదీ నుంచి ఈ టోర్న‌మెంట్ ఆరంభం కానుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ త‌ర‌హాలోనే క్రికెట్‌ను ప్రోత్స‌హించ‌డానికి గ్లోబ‌ల్ టీ20 కెన‌డాను నిర్వ‌హిస్తున్నారు. ఈ టోర్న‌మెంట్‌లో టోరంటో నేష‌న‌ల్స్ త‌ర‌ఫున ఆల్‌రౌండ‌ర్ కేట‌గిరీలో యువ‌రాజ్ సింగ్‌ను తీసుకుంది జ‌ట్టు మేనేజ్‌మెంట్‌.

అంత‌లోనే- మ‌రో టీ20 టోర్న‌మెంట్‌కు కూడా యువ‌రాజ్ సింగ్ ఎంపిక అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. యూరో టీ20 స్లామ్ టోర్న‌మెంట్‌లో కూడా యువ‌రాజ్ ఆడ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉంది. ఆగ‌స్టు 30వ తేదీ నుంచి సెప్టెంబ‌ర్ 22వ తేదీ వ‌ర‌కు యూరో టీ20 స్లామ్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హిస్తారు. నెద‌ర్లాండ్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ల‌ల్లో దీనికి సంబంధించిన మ్యాచ్‌ల‌ను ఏర్పాటు చేస్తారు. ఈ టోర్నమెంట్‌లో యువ‌రాజ్ ఆడే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌ల‌హా క‌మిటీ బోర్డు స‌భ్యుడు, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీప‌ర్ డీన్ జోన్స్ వెల్ల‌డించారు. కొద్దిరోజుల కింద‌టే దేశ‌వాళీ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్‌ను ప్ర‌క‌టించిన మ‌న్‌ప్రీత్ గోని కూడా గ్లోబ‌ల్ టీ20 కెన‌డా టోర్న‌మెంట్‌కు ఎంపికైన‌ట్లు తెలుస్తోంది.

Story first published: Wednesday, June 26, 2019, 16:52 [IST]
Other articles published on Jun 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+