For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రేరణతో ఆడతాడు, టీంలోకి రావాలి: యూవీపై ఢిల్లీ కోచ్ గ్యారీ కిరిస్టెన్

న్యూఢిల్లీ: ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌పై ఢిల్లీ ప్రధాన కోచ్ గ్యారీ కిరిస్టెన్ శుక్రవారం ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంతో ప్రేరణతో యువీ క్రికెట్ ఆడతాడని, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో యువీ బాగా రాణిస్తాడని చెప్పాడు. యువరాజ్ సింగ్ మళ్లీ టీమిండియాలో ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

'భారత జట్టుతో ఆడిన సమయంలో యువరాజ్ సింగ్‌తో పని చేసిన చక్కటి అనుభవం ఉంది' అని కిరిస్టెన్ ఐపిఎల్ టి20.కామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 'యువరాజ్ సింగ్ ఫిట్‌గా ఉన్నాడు. అతడు టీమిండియా తరపు ఆడాలని కోరుకుంటున్నా. యువరాజ్ కంటే ప్రేరణ గల ఆటగాడు ఉన్నాడంటే ఒప్పుకోను' అని గ్యారీ కిరిస్టెన్ తెలిపాడు.

 Yuvraj Singh is immensely motivated to perform in IPL, says Gary Kirsten

ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా జెపి డుమినిని నియమించడం పట్ల స్పందిస్తూ.. ఎడమచేతివాటం గలవారు నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటారని చెప్పాడు. డుమిని చాలా మంచి వ్యక్తి అని తెలిపాడు. దక్షిణాఫ్రికా ట్వంటి20 జట్టుకు ఇప్పటికే డుమిని కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడని చెప్పాడు. అతనికి మంచి నాయకత్వపు లక్షణాలున్నాయని చెప్పాడు.

నిరుడు జరిగిన ఐపిఎల్ నుంచి ఆటగాళ్లు నేర్చుకోవాల్సి ఉందని చెప్పాడు. నిరుటి టోర్నీలో ఢిల్లీ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా 8వ స్థానం నిలిచిందని చెప్పాడు. ఆ ప్రదర్శన నుంచి నేర్చుకున్నామని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ టోర్నీకి ఐపిఎల్‌కి చాలా తేడా ఉంటుందని తెలిపాడు. నిరుటి జట్టు కంటే ఈసారి ఢిల్లీ జట్టు చాలా బలంగా ఉందని గ్యారీ తెలిపాడు. ఈ ఐపిఎల్‌లో తమ జట్టు ఉత్తమంగా రాణిస్తుందనే విశ్వాసం ఉందని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+