Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎవరా ఒక్క ప్లేయర్ అని అడిగిన చెన్నై ఫ్రాంచైజీ: యువీకే ఓటేసిన ఫ్యాన్స్

Yuvraj Singh is fans top pick as the ONE player Chennai Super Kings (CSK) should buy at IPL auctions

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ వేలానికి రంగం సిద్ధమైంది. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 18న జైపూర్ వేదికగా వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి మొత్తం 1003 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారు.

అయితే, వేలానికి సంబంధించి 346 మంది క్రికెటర్ల పేర్లతో బీసీసీఐ జాబితా విడుదల చేసింది. ప్రాంఛైజీలన్నీ తమ జట్లను పటిష్టం చేసుకొనేందుకు ఎదురు చూస్తున్నాయి. వేలానికి ముందే పలువురి ఆటగాళ్లను ప్రాంఛైజీలు విడుదల చేశాయి. వారంతా ఇప్పుడు అదృష్టం పరీక్షించుకోనున్నారు.

రూ.2 కోట్ల కనీస ధరలో

రూ.2 కోట్ల కనీస ధరలో

బీసీసీఐ విడుదల చేసిన జాబితాలో రూ.2 కోట్ల కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేకపోవడం గమనార్హం. ఈ మొత్తంలో ఉన్న 9 మంది ప్లేయర్లు (బ్రెండన్‌ మెకల్లమ్, వోక్స్, లసిత్‌ మలింగ, షాన్‌ మార్ష్, కొలిన్‌ ఇంగ్రామ్, కోరె అండర్సన్, మాథ్యూస్, శ్యామ్‌ కరన్, డార్సీ షార్ట్‌) విదేశీయులే.

గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం

ఒకే రోజుతో ముగిసిపోయే ఐపీఎల్ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. గ‌త సీజ‌న్‌లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ తరఫున బరిలోకి దిగిన టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువ‌రాజ్‌సింగ్‌ను అతని పేలవప్రదర్శన కారణంగా ఆ జట్టు విడుదల చేసింది.

యువీకి ఎంతో కీలకం కానున్న ఐపీఎల్ 2019 సీజన్

దీంతో ఐపీఎల్ 2019 వేలం టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు కీలకం కానుంది. గతేడాదిన్నర కాలంగా జాతీయ జట్టుకు దూరమైన యువీ తనను తాను నిరూపించుకోవాలంటే ఏదో ఒక ప్రాంఛైజీ అతడిని కొనుగోలు చేయాల్సిందే. ఈ ఐపీఎల్‌లో యువీ మెరుపులు మెరుపించకుంటే క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడినట్లే.

కనీస్ ధరను రూ. కోటికి తగ్గించుకున్న యువరాజ్

ఈ ఐపీఎల్‌లో తనను ఏదో ఒక ప్రాంఛైజీ కొనుగోలు చేయాలనే భావనతో ధర సైతం రూ.2 కోట్ల నుంచి కోటికి తగ్గించుకున్నాడు. ఫిట్‌నెస్‌ పెంచుకున్నాడు. ఈ క్రమంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులు యువరాజ్‌ను తీసుకోవాలని ఆ ప్రాంచైజీని పట్టుబడుతున్నారు.

చెన్నై ఫ్రాంచైజీ ట్విట్టర్‌లో ఓటింగ్

తాజాగా చెన్నై ఫ్రాంచైజీ "ఈ సమ్మర్‌లో మనజట్టులో కొత్తగా ఎవరిని కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి" అని అధికారిక ట్వీటర్‌ పేజీలో ఓటింగ్‌ నిర్వహించింది. ఈ ఓటింగ్‌లో చెన్నై అభిమానులు తమకు యువరాజే కావాలంటూ ఓటేశారు. యువీని తీసుకోవాలని.. మళ్లీ యువరాజ్‌-ధోని కాంబో చూడముచ్చటగా ఉంటుందని ట్వీట్ చేశారు.

యువీకే ఓటేసిన చెన్నై అభిమానులు

గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో భారత జట్టుకు దూరమైన యువరాజ్‌.. గత సీజన్‌ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరుపున కూడా దారుణంగా విఫలమయ్యాడు. అయినా సరే చెన్నై అభిమానులు మాత్రం యువరాజే కావాలంటూ పట్టుబడుతుండటం విశేషం. వచ్చే ఏడాది మార్చి 29న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది.

Story first published: Saturday, December 15, 2018, 12:17 [IST]
Other articles published on Dec 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+