న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొడుకు 'రికార్డ్‌'తో బాంబు పేల్చిన తండ్రి: ధోనీకి షాకిచ్చిన యువీ!

By Srinivas

బెంగళూరు: భారత్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ వేలంపాటలో గత ఏడాది రూ.14 కోట్లు పలికిన యువీ, ఈసారి ఏకంగా రూ.16 కోట్లు పలికాడు. అంత పెద్ద మొత్తం పెట్టి అతనిని ఢిల్లీ చేజిక్కించుకుంది. అందుకు అతను ఇటీవలి కాలంలో బాగా రాణించడమే కారణం. యువీని ఢిల్లీ అత్యంత మొత్తానికి కొనుగోలు చేసిన సమయంలోనే అతని తండ్రి యోగరాజ్ సింగ్ భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐసీసీ ప్రపంచకప్ 2015లో యువరాజ్ లేడు. అయితే, రవీంద్ర జడేజా ఫిట్‌గా లేకుంటే అతని స్థానంలో.. యువీకే అవకాశం ఉంటుందనే వార్తలు వచ్చాయి. జడెజా ఫిట్ కావడంతో యువీకి అవకాశం దక్కలేదు. ఇదిలా ఉండగా, సోమవారం నాడు బెంగళూరులో ఐపీల్ ఆటగాళ్ల కోసం వేలం పాడారు.

ఇందులో అందరికంటే ఎక్కువగా యువీ అమ్ముడుపోయారు. గత సీజన్‌లోని అత్యధిక ధర పలికింది యువీనే. ఈసారి కూడా పదహారు కోట్ల రూపాయల ధర పలికాడు. యువీకి అత్యధిక ధర పలికిన నేపథ్యంలో అతని తండ్రి స్పందించి ఉంటారని భావిస్తున్నారు.

Yuvraj Singh in IPL auction 2015 top list, Yograj Singh flays MS Dhoni over World Cup

యువీ అత్యధిక ధరకు అమ్ముడుపోవడం, అతని తండ్రి ప్రపంచకప్ పైన స్పందించడం ఒకేసారి జరిగాయి. యువీ తండ్రి యోగరాజ్ ఆరోపణలు ధోనీకి కొంత ఇబ్బందికర పరిణామమేనని చెప్పవచ్చు. అయితే, ఆయన మాటలు ఎంత వరకు వాస్తవమనేది తేలాల్సి ఉంది. అలాగే, యువీ తండ్రి వ్యాఖ్యల పైన ధోనీ, జట్టు మేనేజ్‌మెంట్ స్పందిస్తుదా లేదా అనేది కూడా చూడాలి.

ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రపంచ కప్‌కు తన కొడుకు యువీ ఎంపిక కాకపోవడం వెనుక ధోని ప్రమేయం ఉందని, ధోని ఒత్తిడి కారణంగానే జాతీయ సెలక్టర్లు ఎంపిక చేయలేదని, ధోనికి తన కుమారుడితో విబేధాలుంటే అందుకు తానేమీ చేయలేనని, ఆ దేవుడే చూసుకుంటాడని, తన తనయుడు ధోనీని ఎప్పుడు పొగిడేవాడని వ్యాఖ్యానించారు. యువీ పట్ల ఇంత దారణంగా ప్రవర్తించడం కంటే విచారించదగ్గ అంశం మరోకటి ఉండదన్నాడు.

వరల్డ్ కప్ ప్రాబబుల్స్ జాబితాలో యువరాజ్ సింగ్ చోటు దక్కించుకున్న తర్వాత రంజీల్లో వరుస సెంచరీలు సాధించాడు. దీంతో యువరాజ్ సింగ్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందని అందరూ భావించినా, సెలక్టర్లు మొండి చేయి చూపించారు. దీని వెనుక ధోనీ ఉన్నాడని యువీ తండ్రి ఆరోపిస్తున్నారు.

తన తండ్రి వ్యాఖ్యల పైన యువరాజ్ కూడా స్పందించారు. అందరిలాగే తన తండ్రి కూడా ఆవేదనకు గురయ్యాడని కానీ, ధోనీ నాయకత్వంలో ఆటను ఎంతో ఆస్వాదించానని, భవిష్యత్తులో ఆస్వాదిస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కానీ తన తండ్రి వ్యాఖ్యలను సమర్థించినట్లుగా లేదా కొట్టి పారేసినట్లుగా కనిపించలేదు. ఒకవిధంగా తండ్రికి మద్దతుగా మాట్లాడినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ధోనీ పట్ల యువీ వైఖరి ఏమిటనే చర్చ సాగుతోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X