Yuvraj Singh : అప్పుడు నేనే కెప్టెన్ కావాల్సింది.. కావాలనే నన్ను కాదని ధోనీకి కెప్టెన్సీ ఇచ్చారు

2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని నియమించడం అప్పట్లో ఆశ్చర్యకరమైన నిర్ణయం. ఎందుకంటే అప్పటికే వికెట్ కీపర్-బ్యాటర్ అయిన ధోనీ కంటే సీనియర్లు జట్టులో చాలా మంది ఉన్నారు. వారిలో ఒకడు యువరాజ్ సింగ్. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్ పర్యటనలో రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో టీమిండియా జట్టుకు యువరాజ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇక టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టుకు ఆడబోమని ద్రావిడ్‌తో పాటు పలువురు ఇతర సీనియర్ ఆటగాళ్లు టోర్నమెంట్ నుండి వైదొలగడంతో.. యువరాజ్ ఇక కెప్టెన్సీ చేపట్టడం ఖాయమని అంతా భావించారు. అయితే బీసీసీఐ సెలెక్టర్లు అనూహ్యంగా యువరాజ్‌ను కాదని ధోనీనీ కెప్టెన్‌గా చేశారు.
ఇక మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌ను ధోనీ సారథ్యంలో టీమిండియా ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇక ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో యువరాజ్ సింగ్ సంచలనాత్మక ప్రదర్శన చేశాడు. కానీ అతను జట్టుకు సారథ్యం వహించే ఛాన్స్ మిస్సయ్యాడు. ఇక అదే సమయంలో భారత కోచ్ గ్రెగ్ చాపెల్ వివాదం టీమిండియా క్రికెట్‌ను కుదిపేసింది. ఆ ఎపిసోడ్‌లో సచిన్ టెండూల్కర్‌కు యువరాజ్ మద్దతు ఇవ్వడంతోనే తాను కెప్టెన్సీని కోల్పోయానని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

యువరాజ్ ఆ వివాదంలో జోక్యం చేసుకోవడమే కొంపముంచింది
2005 నుండి 2007వరకు చాపెల్ భారతదేశ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అతని పదవీకాలం వివాదాలతో కొనసాగింది. ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌తో సహా పలువురు సీనియర్ ఆటగాళ్లతో ఆయన విభేదాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్.. ఈ వివాదాల్లో సచిన్‌కు మద్దతుగా నిలబడ్డాడు.
ఒక ప్లేయర్ వివాదాల్లో దూరకుండా ఉండాలని బీసీసీఐ భావించింది. కానీ యువరాజ్ జోక్యం చేసుకోవడం బీసీసీఐ అధికారులకు నచ్చలేదు. ఫలితంగా అతన్ని టీమిండియా వైస్ కెప్టెన్‌గా తొలుత తొలగించింది.

నేనే కెప్టెన్ కావాల్సింది కానీ..
స్పోర్ట్స్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సంజయ్ మంజ్రేకర్‌తో మాట్లాడుతూ.. 'నేను కెప్టెన్‌గా కావాల్సింది. అప్పుడు గ్రెగ్ చాపెల్ సంఘటన జరిగింది. అది చాపెల్ వర్సెస్ సచిన్‌లాగా వివాదం మారింది. టీంలో నేను మాత్రమే సచిన్‌కు మద్దతునిచ్చిన ఏకైక ఆటగాడిని అయ్యాను.
మరియు చాలా మంది ఇతర ప్లేయర్లు అసలు ఈ వివాదంలో ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. ఇలా నేను వ్యవహరించడం కొంతమంది బీసీసీఐ అధికారులకు నచ్చలేదు. నన్ను కాదని టీంలో వేరే ఎవరినైనా కెప్టెన్‌గా చేయాలని అప్పట్లో సెలెక్టర్లు అభిప్రాయపడ్డారన్న విషయం నాకు కొందరి ద్వారా తెలిసింది.' అని యువరాజ్ చెప్పాడు.

అనూహ్యంగా ధోనీ కెప్టెన్ అయిపోయాడు
బీసీసీఐ సెలెక్టర్లు నన్ను కాదని వేరేవారికి కెప్టెన్సీ ఇవ్వాలనే విషయం ఎంతవరకు నిజమో నాకు తెలియదు కాదు కానీ అకస్మాత్తుగా నన్ను తొలుత వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆ టైంలో సెహ్వాగ్ జట్టులో లేకపోవడంతో అనూహ్యంగా 2007 టీ20 ప్రపంచకప్‌కు ధోనీ కెప్టెన్ అయ్యాడు. అసలు నన్నే కెప్టెన్ చేస్తారని అనుకున్నాను. కానీ ఆ వివాదం నాకు కెప్టెన్సీ దక్కకుండా చేసింది.' అని యువరాజ్ పేర్కొన్నాడు.

నాకు వ్యతిరేకంగా నిర్ణయం జరిగింది
'ఇక ఎంఎస్ ధోని అద్భుతంగా కెప్టెన్సీ వహించడంతో తాను ఇక కంగారుపడలేదు. నేనే కెప్టెన్ కావాల్సింది. అయినా నాకు వ్యతిరేకంగా నిర్ణయం జరిగింది. అయినా ఈ నిర్ణయం గురించి నేను పశ్చాత్తాపపడను. నాకు ఎలాంటి రిగ్రేట్స్ లేవు. ఈరోజు కూడా అదే జరిగితే నేను తప్పకుండా ఆ నిర్ణయాన్ని తప్పకుండా స్వాగతిస్తాను' అని యువీ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications