57 బంతుల్లో 80 పరుగులు: ఐపీఎల్‌కు ముందు ఫామ్‌లోకి యువరాజ్


హైదరాబాద్: 2019 ఐపీఎల్ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో యువరాజ్ సింగ్‌ని చివరి నిమిషంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. 37 ఏళ్ల యువరాజ్ సింగ్ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ ఏడాది ఇప్పటివరకు యువీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ని మాత్రం ఆడలేకపోయాడు.

ఫామ్‌లోకి యువరాజ్
డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్‌లో 57 బంతుల్లో 80 పరుగులు చేసిన యువరాజ్ ఫామ్‌లోకి వచ్చాడు. సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీ, ఐపీఎల్ ప్రారంభానికి ముందు యువీకి ఈ మ్యాచ్ సన్నాహకంగా కలిసొచ్చింది. ఎయిర్ ఇండియా 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన యువరాజ్ మూడో వికెట్‌కు ఐపీఎల్ స్టార్ పౌల్ వాల్థాటీతో కలిసి 51 పరుగులు జోడించాడు.
యువరాజ్ హాఫ్ సెంచరీ
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సుజిత్ నాయక్‌తో కలిసి 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. యువరాజ్ హాఫ్ సెంచరీతో మెరవడంతో ఎయిర్ ఇండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కస్టమ్స్ జట్టు 9 వికెట్ల తేడాతో నెగ్గింది.

ముస్తాఖ్ అలీ ట్రోఫీలో యువరాజ్
ముంబై కస్టమ్స్ జట్టులో విక్రాంత్ ఔటి (86 నాటౌట్), స్వప్నిల్ ప్రధాన్ (67 నాటౌట్) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. డీవై పాటిల్ టీ20 టోర్నీ ముగిశాక ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో యువరాజ్ సింగ్ ఆడనున్నాడు. 2011లో భారత్‌కు ఒంటి చేత్తో వరల్డ్ కప్ అందించిన యువీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ 2018లోనూ పేలవ ప్రదర్శన చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications