యువీ పెళ్లిలో అంబానీ దంపతులు: కోహ్లీ-అనుష్క సందడి
హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి మోడల్ హాజెల్ కీచ్‌లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీన సిక్కు సంప్రదాయ ప్రకారం చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం 'బాబా రాందేవ్ సింగ్ డేరా'లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
గోవాలో యువరాజ్- హాజెల్ కీచ్‌ల పెళ్లి ఫోటోలు
డిసెంబర్ 2(శుక్రవారం)న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం యువరాజ్ సింగ్, నటి మోడల్ హాజెల్ కీచ్‌ల మళ్లీ వివాహం చేసుకున్నారు. నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు.
అయితే ఈ వివాహం జరగడానికి ఓ కారణం ఉంది. హాజెల్ కీచ్ తల్లి భారతీయులు. అంతేకాదు బీహార్‌కు చెందిన హిందువు కాగా, తండ్రి బ్రిటన్ వాసి. దీంతో ఇరు కుటుంబ సభ్యుల కోరిక మేరకు యువరాజ్, హాజెల్‌ల వివాహాన్ని సిక్కు, హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు.
ఇక, డిసెంబర్ 7వ తేదీన ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్‌లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోడీతో సహా బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ హాజరవుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే గురుద్వారాలో వివాహ అనంతరం హాజెల్ కీచ్ పేరును 'గుర్బసంత్ కౌర్'గా మార్చినట్లు సమాచారం.
కాగా, గోవాలో ఆడంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో హాజరయ్యాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు, రోహిత్ శర్మ దంపతులతో పాటు మాజీ క్రికెటర్లు జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

యువీ పెళ్లిలో అంబానీ దంపతులు
గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం యువీ, హాజెల్ కీచ్‌ల వివాహం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు ఈ పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు.

సందడి చేసిన కోహ్లీ-అనుష్క
గోవాలో యువీ, హాజెల్ కీచ్‌ల వివాహంలో సందడి చేసిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ.

పెళ్లి తంతులో భాగంగా యువీ, హాజెల్
పెళ్లి తంతులో భాగంగా యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ దంపతులు.

పెళ్లిలో యువీ, హాజెల్
పెళ్లి తంతులో భాగంగా యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ దంపతులు.

నమస్కారం
పెళ్లి తంతులో భాగంగా నమస్కారం చేస్తున్న యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ దంపతులు.

నుదుటన తిలకం దిద్దుతున్న యువరాజ్
పెళ్లి తంతులో భాగంగా హాజెల్ కీచ్ నుదుటన తిలకం దిద్దుతున్న యువరాజ్.

గోవాలో జరిగిన యువీ పెళ్లికి హాజరైన మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా
గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం యువీ, హాజెల్ కీచ్‌ల వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరైన టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా.

యువీ పెళ్లిలో సందడి చేసిన మోడల్స్
గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం యువీ, హాజెల్ కీచ్‌ల వివాహం జరిగింది. ఈ పెళ్లిలో పలువురు మోడల్స్ సందడి చేశారు.

యువీ పెళ్లిలో టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్
గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం యువీ, హాజెల్ కీచ్‌ల వివాహం జరిగింది. ఈ పెళ్లిలో సందడి చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్

యువరాజ్ తల్లి షబ్నం సింగ్‌తో జహీర్ ఖాన్
గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం యువీ, హాజెల్ కీచ్‌ల వివాహం జరిగింది. ఈ పెళ్లికి పలువురు మాజీ క్రికెటర్లు హాజరయ్యారు.

పెళ్లి దుస్తుల్లో హాజెల్ కీచ్
గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం యువీ, హాజెల్ కీచ్‌ల వివాహం జరిగింది. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న హాజెల్ కీచ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications