For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘ఈ నగరం పేరేంటి?’ కోహ్లీ ప్రశ్నకు యువరాజ్ చిలిపి సమాధానం

Yuvraj Singh Has A Rib-Tickling Answer To Virat Kohlis Guess This City Question

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అడిగిన ప్రశ్నకు టీమిండియా వెటరన్ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ చిలిపిగా సమాధానం ఇచ్చాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్ కోసం టీమిండియా మే22న ఇంగ్లాండ్‌కు పయనం కానుంది. ఐపీఎల్‌ తర్వాత సరదాగా గడుపుతున్న కోహ్లీ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

తాను గతంలో తీసుకున్న ఓ చిత్రం ఉంచి 'ఈ నగరం పేరేంటి?' అని అడిగాడు. ఈ పోస్టుకు 20లక్షలకు పైగా లైకులు రాగా 24,000 మందికి పైగా బదులిచ్చారు. ఇందులో చాలా మంది విరాట్‌ కోహ్లి ప్రశ్నకు సరిగ్గానే సమాధానం ఇచ్చారు. అయితే యువీ మాత్రం 'కోట్కాపురాలా కనిపిస్తోంది??? ఏమంటావు హర్భజన్‌' అని సమాధానం ఇచ్చాడు.

అయితే విరాట్‌ పెట్టిన చిత్రం చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రాగ్‌ నగరానిది. అక్కడి ఓల్డ్‌టౌన్‌ స్క్వేర్‌ వద్ద తీసుకున్న చిత్రమది. ఇంతకీ 'కోట్కాపుర' ఏంటో తెలుసా? పంజాబ్‌లోని ఓ చారిత్రక నగరం. పత్తి మార్కెట్‌కు ప్రసిద్ది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది.

Yuvraj Singh Has A Rib-Tickling Answer To Virat Kohlis Guess This City Question

కాగా, 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Story first published: Sunday, May 19, 2019, 11:58 [IST]
Other articles published on May 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+