యువీ, కీచ్‌ల పెళ్లి: ట్విట్టర్‌లో ఎవరేమన్నారంటే
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి, మోడల్ హాజెల్ కీచ్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం 'బాబా రాందేవ్ సింగ్ డేరా'లో అంగరంగ వైభవంగా జరిగింది.
పంజాబీ సంప్రదాయం 'ఆనంద్ కరాజ్' పద్ధతిలో యువరాజ్, కీచ్‌ల వివాహం జరిగింది. వివాహం అనంతరం నూతన దంపతులు బాబా రామ్‌సింగ్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. యువరాజ్ తల్లి షబ్నం సింగ్ అత్యంత ఇష్టపడే, ఎంపికచేసిన వేదికలో యువీ.. హజెల్‌కీచ్ మెడలో తాళి కట్టాడు.
నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుక ఏర్పాట్లను తల్లి షబ్నమ్ సింగ్ దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఈ పెళ్లికి రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి సందర్భంగా బాబా రాందేవ్ సింగ్ డేరా వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు.
మెరూన్, బంగారు వర్ణంలోని షేర్వాణీలో యువరాజ్ కత్తి చేతబట్టి రాజసం ఉట్టిపడింది. ఇక వధువు హజెల్‌కీచ్ రిచ్ డిజైనరీ లెహంగాతో అందంగా నగలు అలంకరించుకొని ఉంది. ఈ వివాహానికి యువీ తండ్రి యెగ్‌రాజ్ సింగ్ హాజరుకాలేదు. పెళ్లికి ముందు రోజు జరిగిన మెహందీ, సంగీత్ వేడుకకు హాజరయ్యారు.
వివాహ బంధంతో ఒక్కటైన యువీ, హాజెల్ కీచ్ దంపతులకు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుతం ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. గౌతం గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్ పఠాన్, మురళీ కార్తిక్, హార్భజన్ సింగ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
ఇర్ఫాన్ పఠాన్
యువీ బ్రదర్ ఇంక బ్యాచిలర్ కాదు. ఏమీ భయపడకు. ఇదో అద్భుతమైన బంధం. అద్భుతమైన జంటకు శుభాకాంక్షలు.
హార్భజన్ సింగ్
శుభాకాంక్షలు. ఈ ఫోటోలో నీ ఎక్స ప్రెషన్ అర్ధం ఏమిటి? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా. చూసేందుకు అందంగా ఉన్నావు.
మురళీ కార్తిక్
వివాహ బంధంలో ఒక్కటి కాబోతున్న యువీ, హాజెల్ కీచ్‌లకు శుభాకాంక్షలు.
వీవీఎస్ లక్ష్మణ్
పెళ్లి బంధంలో ఒక్కటి కాబోతున్న నా డియర్ ఫ్రెండ్స్ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌లకు అభినందనలు.
టామ్ మూడీ
వివాహ బంధంలో ఒక్కటి కాబోతున్న యువీ, హాజెల్ కీచ్‌లకు శుభాకాంక్షలు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications