న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సారీ రాహుల్: ఐపీఎల్‌కు ముందు యువీ కొత్త హెయిర్ స్టైల్ చూశారా

By Nageshwara Rao
Yuvraj Singh Gets A Haircut, Apologises To KL Rahul

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో క్రికెటర్లు కొత్త లుక్‌లో కనిపించడం సర్వసాధారణం అయింది. ఇక, ఐపీఎల్ సీజన్ వస్తుంందంటే చాలు క్రికెటర్లు తమ కొత్త హెయిర్ స్టైల్స్‌తో అభిమానులను అలరిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం కోహ్లీ తన హెయిర్‌స్టైల్‌ను మార్చి సరికొత్త లుక్‌లో కనిపించగా, తాజాగా యువరాజ్‌ కూడా కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించారు.

తన కొత్త హెయిల్ స్టైల్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన యువీ.. ఈ సందర్భంగా యువ క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు సారీ చెప్పాడు. కేఎల్ రాహుల్‌కు యువీ సారీ చెప్పింది ఏదో తప్పు చేసినందుకు కాదు... హెయిర్ కట్ చేయించుకున్నందుకు.

'చాలా కాలం తర్వాత నా పొడుగు జుట్టుతో జరిగిన పోరాటం ముగిసింది. ఇది నా కొత్త లక్‌. కేఎల్ రాహుల్ సారీ. అంగధ్ బేడీ నన్ను హెయిర్ కట్ చేయించుకోమని బలవంతం చేశాడు. హెయిర్ కట్ చేసినందుకు అలీం హకీంకి థ్యాంక్స్‌' అంటూ యువరాజ్ సింగ్ పోస్ట్ చేశాడు.

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్) 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో యువీని పంజాబ్ జట్టు కనీస ధర రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, కొద్ది రోజుల క్రితం కోహ్లీ కూడా హకీం వద్ద కట్టింగ్ చేయించుకొని ఆ ఫోటో ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Great cut from the style master @aalimhakim 👌

A post shared by Virat Kohli (@virat.kohli) on

Story first published: Saturday, March 24, 2018, 17:22 [IST]
Other articles published on Mar 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X