బెంగుళూరు: బ్రిటిష్ మోడల్, నటి హాజిల్ కీచ్‌తో తన పెళ్లి అంటూ మీడియాలో వస్తున్న వార్తలను టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఖండించాడు. 33ఏళ్ల యువీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బ్రిటిష్ నటి హాజిల్ కీచ్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నెలలోనే వీరి ఎంగేజ్‌మెంట్ ఉండబోతుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను బుధవారం యువరాజ్ ట్విట్టర్‌లో ఖండించారు. 'నా ప్రిమయైన మీడియా నా పెళ్లి ఏ నెలలో జరగనుందో ఆ తేదీని అదే విధంగా వేదికను ఖరారు చేసి చెప్తే అనుకున్న సమయానికి హాజరవుతా' అంటూ ట్వీట్ చేశారు.
నవంబర్ 3 (మంగళవారం)నాడు టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌ను పెళ్లి చేసుకోవాల్సిందిగా ట్విట్టర్‌లో కోరిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌పై వెంటనే స్పందించిన హర్భజన్ నువ్వు కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశాడు.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్ ఖాన్ ప్రస్తుతం బ్యాచిలర్‌గా ఉన్నాడు. గత వారం స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ బాలీవుడ్ నటి గీతా బస్రాను పెళ్లాడారు. ఈ క్రమంలో పలువురు క్రికెటర్లను యువరాజ్‌ను పెళ్లి చేసుకోవాలంటూ కోరుతున్నారు. కాగా, 28 ఏళ్ల బ్రిటిష్ మోడల్, నటి హాజిల్ కీచ్ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సరసన 'బాడీగార్డ్' అనే సినిమాలో నటించింది.