భారత జట్టులో యువీ: ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశాడు
హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు వన్డేలు, టీ20ల సిరీస్‌లకు బీసీసీఐ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. భారత జట్టులో మళ్లీ చోటు దక్కించుకోవడంపై యువీ ఎంతో సంతోషంగా ఉన్నాడు.
దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత యువరాజ్ సింగ్ వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2013 డిసెంబర్‌లో చివరిసారిగా భారత జట్టు తరఫున యువరాజ్ సింగ్ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు జట్టుకు దూరంగానే ఉన్నాడు.

ట్వీట్‌ని డిలీట్ చేసిన యువరాజ్
ఆ తరువాత పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ సరైన అవకాశాలు రాలేదు. వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్న యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ సిరిస్‌కు ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత ఓ ట్వీట్‌ని తన ట్విట్టర్ ఖాతా నుంచి డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.

అందులో 'యా బేబీ' అని రాసి ఉంది
ఆ ట్వీట్‌లో 'యా బేబీ' అని రాసి ఉంది. అయితే యువీ ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారో అర్ధం కావడం లేదు. ఆ తర్వాత యువీ ఆ ట్వీట్‌ని డిలీట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే భారత జట్టులో తిరిగి చోటు సంపాదించేందుకు యువీ చాలానే కష్టపడాల్సి వచ్చింది.

2016 17 రంజీ సీజన్‌లో అద్భుత ప్రదర్శన
గత ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఫైనల్‌లోకి తీసుకెళ్లడంలో ముఖ్యభూమిక పోషించాడు. అయినా సరే సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. దీంతో 2016 17 రంజీ సీజన్‌లో ఆడిన యువరాజ్ సింగ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. పంజాబ్ కెప్టెన్ గా 5 మ్యాచ్‌లు ఆడిన యువీ 84 సగటుతో 672 పరుగులు చేశాడు.

గత ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఫైనల్‌లోకి తీసుకెళ్లడంలో ముఖ్యభూమిక పోషించాడు. అయినా సరే సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. దీంతో 2016 17 రంజీ సీజన్‌లో ఆడిన యువరాజ్ సింగ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. పంజాబ్ కెప్టెన్ గా 5 మ్యాచ్‌లు ఆడిన యువీ 84 సగటుతో 672 పరుగులు చేశాడు.
దేశవాళీ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని జట్టులోకి తీసుకోవడం జరిగిందని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ జట్టును ప్రకటించే సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కాకుండా ఒక డబుల్ సెంచరీతో పాటు 180 కూడా స్కోర్ చేసి చక్కని ఫామ్ కనబర్చాడని ఆయన గుర్తు చేశారు.

క్రెడిట్ కొట్టేసిన హాజెల్ కీచ్
అందుకే యూవీకి రెండు ఫార్మెట్‌లలో అవకాశం ఇచ్చామని తెలిపారు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. దీంతో యువీకి భారత జట్టులో స్థానం కల్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది. వివాహం తరువాత ఈ ఘనతను సొంతం చేసుకోవడంతో క్రెడిట్ మొత్తం అభిమానులు హాజెల్ కీచ్‌కు ఇస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications